కృష్ణ

‘మడ’ను పీడిస్తున్న అధికారుల కొరత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 28: మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ)ని అధికారుల కొరత సమస్య పట్టిపీడిస్తోంది. మడ ద్వారా బందరు పోర్టు, అనుబంధ పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములను సమీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో అధికారుల కొరత తలనొప్పిగా మారింది. ఫలితంగా నోటిఫికేషన్ జారీచేసే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పోర్టు, పరిశ్రమల స్థాపనకు మొదటి విడతలో 14వేల ఎకరాల పట్టా భూములు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఐదురోజుల క్రితం ల్యాండ్‌పూలింగ్ విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో నెం. 185 జారీ అయింది. జీవో జారీ అయిన రెండు మూడు రోజులకే తొలివిడతగా 14వేల ఎకరాల పట్టా భూములకు సంబంధించి నోటిఫికేషన్ వెలువరిస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. కానీ ‘మడ’కు తగినంత స్థాయిలో అధికార గణం లేనందున నోటిఫికేషన్ జారీలో జాప్యం పెరుగుతూ వస్తోంది. గత ఫిబ్రవరిలో ప్రభుత్వం ‘మడ’ను ఏర్పాటు చేయగా 15 మంది డెప్యూటీ కలెక్టర్లను నియమించింది. తాజాగా మరో ముగ్గురు డెప్యూటీ కలెక్టర్లను నియమించారు. మరికొందరు సర్వేయర్లను నియమించాల్సి ఉంది. తొలుత మడ వైస్ చైర్మన్‌గా జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడును నియమించారు. అయితే రెండు పదవులను నిర్వహించే విషయంలో చంద్రుడు కొంత పని ఒత్తిడికి గురవుతున్నారు. ఈనేపథ్యంలో మడకు ప్రత్యేకంగా వైస్ చైర్మన్‌ను నియమించాలని భావించిన ప్రభుత్వం ఐఎఎస్ అధికారి పిఎ శోభను నియమిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆమె గత ఏడాదిగా సెలవులో ఉండటంతో బాధ్యతలు స్వీకరించేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఈనేపథ్యంలో మరో అధికారి కోసం ప్రభుత్వం అనే్వషణలో పడింది. సమర్ధవంతమైన అధికారిని వైస్ చైర్మన్‌గా నియమించి భూసమీకరణ ప్రక్రియను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదిలావుండగా మడ కోసం నియమించిన 15 మంది డెప్యూటీ కలెక్టర్లలో ఇప్పటివరకు ఐదుగురు మాత్రమే పదవీ బాధ్యతలు స్వీకరించారు. మిగిలిన వారంతా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. దీనికితోడు ల్యాండ్‌పూలింగ్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల నేపథ్యంలో సమీకరణలో జాప్యం తగదని ప్రభుత్వం భావిస్తోంది. భూములిచ్చే రైతుల్లో వ్యతిరేకత రాకముందే ముందుగా పోర్టు భూముల వరకు నోటిఫికేషన్ జారీ చేయాలన్న నిర్ణయానికి వచ్చింది. గత మూడు రోజులుగా మడకు చెందిన ఐదుగురు డెప్యూటీ కలెక్టర్లతో పాటు బందరు ఆర్డీవో సాయిబాబు, రెవెన్యూ సిబ్బంది బందరు పోర్టుకు ప్రతిపాదించిన 4వేల 636 ఎకరాలకు సంబంధించిన భూముల సర్వే నెంబర్ల వివరాలను పరిశీలిస్తున్నారు. క్షుణ్ణంగా సర్వే నెంబర్లను పరిశీలించిన అనంతరం నేడోరేపో పోర్టు భూములకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. మడకు ఇప్పటివరకు కార్యాలయం కూడా ఏర్పాటు చేయకపోవడం కొసమెరుపు. కార్యాలయం లేనిదే అధికారులు ఎలా విధులు నిర్వహిస్తారనేది ప్రశ్నగా మారింది.