కృష్ణ

మొక్కలతో ఆరోగ్యవంతమైన సమాజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 29: బాధ్యతతో మొక్కలు నాటుదాం.. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం.. అంటూ పలువురు వక్తలు పిలుపునిచ్చారు. హరితాంధ్రప్రదేశ్ సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నూజివీడులో శ్రీకారం చుట్టిన ‘వనం-మనం’ కార్యక్రమానికి జిల్లాలో విశేష స్పందన లభించింది. ‘వనం-మనం’ పేరిట జిల్లా అంతటా లక్షలాది మొక్కలు నాటారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆలయాల్లోనే కాకుండా ప్రధాన రహదార్లకు రెండు వైపులా కిలోమీటర్ల మేర మొక్కలు నాటారు. ర్యాలీలు, మానవ హారాలు నిర్వహించి మొక్కల పెంపకం పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని రుస్తుంబాద మున్సిపల్ హైస్కూల్‌లో జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య, పట్టణ ప్రథమ పౌరుడు, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ ‘వనం-మనం’ పేరిట మొక్కలు నాటారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి విజయ్‌కుమార్ మొక్కలు నాటారు. చిలకలపూడి పోలీసు స్టేషన్‌లో బందరు డిఎస్‌పి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ మొక్కలతోనే మానవ మనుగడ ముడిపడి ఉందన్నారు. ప్రాణవాయువు అందించే మొక్కలను ప్రతి ఒక్కరూ విధిగా పెంచి పోషించాలన్నారు. 1వ వార్డు హౌసింగ్ బోర్డు కాలనీలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ మాట్లాడుతూ వృక్షో రక్షిత రక్షితః నానుడిని ప్రతి ఒక్కరూ నిజం చేయాలన్నారు. పచ్చదనాన్ని పెంచితే మనిషి ఆయుష్షు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. లేడియాంప్తిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి కూడా మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాల్లో వైస్ చైర్మన్ కాశీ విశే్వశ్వరరావు, కమిషనర్ జస్వంతరావు, లేడియాంప్తిల్ కళాశాల ప్రిన్సిపాల్ దామోదరరావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రొగ్రామ్ కో-ఆర్డినేటర్, లంకిశెట్టి హరనాధ్, కౌన్సిలర్లు బత్తిన దాస్, తమ్మన హేమ కుసుమ, లోగిశెట్టి వెంకటస్వామి, కాకొల్లు లీలాకుమారి తదితరులు పాల్గొన్నారు.