కృష్ణ

వనదీక్ష’కు శ్రీకారం చుట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, జూలై 29: సమాజంలోని ప్రతి ఒక్కరూ ఇంటి ప్రాంగణాలలో, కార్యాలయ ప్రాంగణాలలో మొక్కలు నాటి వనదీక్షకు శ్రీకారం చుట్టాలని ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. గ్రీనరీకి తొలి తాంబూలం ఇవ్వాలని కోరారు. కృష్ణాజిల్లా నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలోని అటవీ భూముల్లో మిషన్ హరితాంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న వనం-మనం కార్యక్రమంలో భాగంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని సిఎం చంద్రబాబు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. సాంప్రదాయ బద్దంగా రావిచెట్టు వేపచెట్టు కలసి ఉన్న మొక్కతో పాటు ఔషద మొక్కలను చంద్రబాబు నాటారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ సమాజంలో చాలా మంది భక్తులు భవానీ, అయ్యప్ప, హనుమాన్‌తో పాటు రకరకాల దీక్షలు కుటుంబ సంక్షేమాన్ని కోరుతూ భగవంతుడ్ని ప్రార్ధిస్తూ చేస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని తమతో పాటు సమాజ శ్రేయస్సు కోరుతూ ప్రతి ఒక్కరూ వనదీక్ష చేపట్టాలని పిలుపు నిచ్చారు. చెట్లు పెంచటం వల్ల ఎనె్నన్నో ఉపయోగాలు ఉన్నాయని పేర్కొంటూ, చెట్ల పెంపకం ఆవశ్యకతను సోదాహరణంగా వివరించారు. రాష్ట్రంలో మహోధ్యమంగా మొక్కల పెంపకం కార్యక్రమం జరగాలని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో పచ్చదనం అటవీ భూముల్లో 23శాతం, పంట పొలాల్లో మూడు ఉందని, దీనిని 2029 నాటికి 50 శాతం వరకు పెంచటమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. దూరదృష్టితో ఆలోచించి మిషన్ హరితాంధ్రప్రదేశ్‌కు శ్రీకారం చుట్టామని, 2029 నాటికి 30 కోట్ల మొక్కలు నాటుతామని అన్నారు. నేడు నాటుతున్న ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేస్తున్నామని, దాని స్థితిగతులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తానని చెప్పారు. సమాజంలోని వివిధ వర్గాల ప్రజలు అందరూ సమిష్టిగా మొక్కలు నాటాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాలు, విశ్వవిద్యాలయం ప్రాంగణాలు, కాలువ గట్లపై మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని చంద్రబాబు సూచించారు. ప్రధాన రహదారుల కిరువైపుల నాటిన మొక్కలను నిత్యం నీరు పోసి సంరక్షిస్తే ఎన్‌ఆర్‌ఇజిఎస్ కింద ప్రతి వంద చెట్లకు నెలకు పది వేల రూపాయల జీతం ఇస్తామని ప్రకటించారు. వివిధ కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఉద్యోగలు బదలీలు, ఉద్యోగుల పదోన్నతలు, ఉద్యోగుల నియామకాలలో వనదీక్ష చేసిన వారికే తొలి ప్రాధాన్యత ఇస్తామని ఆయన వెల్లడించారు. పండుగలకు, శుభకార్యాలయాలకు మొక్కలను బహుమతులుగా ఇవ్వాలని సూచించారు. ఇతర దేశాల్లో ఎంతో సుందరమైన అడవులు ఉన్నాయని, వీటిపై పరిశోధన చేసి, మన రాష్ట్రంలో కూడా అడవులు అదేవిధంగా అభివృద్ధి చేయాలని సూచించామని చెప్పారు. రాజకీయ పదవులతో పాటు వివిధ ఎన్నికలలో పోటీ చేయాలంటే వనదీక్ష చేపట్టిన వారికే టిక్కెట్లు ఇస్తామని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 10,500 టన్నుల విత్తనాలు అడవుల్లో చల్లెందేకు సిద్ధంగా ఉన్నాయని, వీటితో అడవులను అభివృద్ధి చేస్తామని అన్నారు. నెలలో ప్రతి నాలుగో శనివారం వనం-మనం కార్యక్రమంపై ప్రత్యేక సమీక్ష జరుపుతామని, ఆరోజు అన్నింటికి శెలవు దినంగా ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ట్రీ బ్యాంకులను ఏర్పాటు చేయటంతో పాటు నర్సరీలలో అందుబాటులో ఉన్న మొక్కలను ఆన్‌లైన్‌లో ఉంచుతామని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టటం దేశంలోనే అద్బుతమైన విషయమని అభివర్ణించారు. రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఎపి సిఎం చంద్రబాబు చేపట్టిన మిషన్ హరితాంద్రప్రదేశ్‌కు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని కోరారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ఎస్‌బిఎల్ మిత్ర, పిసిపిఎఫ్ అడ్మినిస్ట్రేషన్ కలగాని రమేష్, ప్రత్యేక కార్యదర్శి పి రమేష్, డిఐజి రామకృష్ణ, జిల్లా కలెక్టర్ బాబు ఎ, ఏలూరు ఎంపి మాగంటి వెంకటేశ్వరరావు, నూజివీడు టిడిపి ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.