కృష్ణ

మా సహనాన్ని పరీక్షించకండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 31: రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తమ ఓర్పు, సహనాన్ని పరీక్షించవద్దని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సాయంత్రం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచార సభలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలన్నారు. లేకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల నుండి తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని మంత్రి రవీంద్ర హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం దిగివచ్చేలా హోదా కోసం పోరాడతామన్నారు. రాజ్యసభలో ప్రత్యేక హోదా బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన అరుణ్ జైట్లీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు అధికారంలోకి రాకముందు హోదా ఇస్తామని చెప్పి నేడు హోదా ఇవ్వడం అసాధ్యమనటం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా కోసమే ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తున్నారన్నారు. హోదా ఇవ్వమని తేల్చిచెబితే తాము కూడా బిజెపితో తెగదెంపులకు సిద్ధంగా ఉన్నామన్నారు. గడచిన రెండేళ్ల ఎన్డీఏ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. పెద్దఎత్తున నిధులు ఇస్తున్నామని కుంటిసాకులు చెబుతూ ప్రత్యేక హోదా హామీని విస్మరిస్తున్నారని విరుచుకుపడ్డారు. విభజన చట్టంలోని ప్రతి అంశాన్ని అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రజలతో కలిసి కేంద్రంపై పోరాడేందుకు టిడిపి సిద్ధంగా ఉందన్నారు. విభజన సమయంలో పార్లమెంట్‌లో నాటి యుపిఏ ప్రభుత్వం అనుసరించిన వైఖరినే ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కూడా అనుసరిస్తోందని ధ్వజమెత్తారు. హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడాల్సిన ప్రతిపక్ష కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. విభజన సమయంలో పార్లమెంట్‌లో వినోదాన్ని చూసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ శకుని పాత్ర పోషిస్తోందని విమర్శించారు. రాజ్యసభలో కాంగ్రెస్‌కు బలం ఉన్నప్పటికీ నిరసన గళం వినిపించడంలో విఫలమయ్యారన్నారు. తమ ఎంపిలు నిరంతరం హోదా కోసం పార్లమెంట్‌లో పోరాడుతున్నారన్నారు. మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.