కృష్ణ

మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగాయలంక, ఆగస్టు 4: మత్స్య పరిశ్రమ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మండల పరిధిలోని భావదేవరపల్లి గ్రామంలో గురువారం మండలి వెంకట కృష్ణారావు ఫిషరీష్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో రూ.80లక్షల వ్యయంతో నిర్మించిన రైతు శిక్షణ కేంద్ర నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి పుల్లారావు మాట్లాడుతూ మత్స్య పరిశ్రమ ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.34 వేల కోట్ల మేర ఆదాయం లభిస్తుందన్నారు. కోస్తా తీరప్రాంతంలోని మత్స్య పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. తీరప్రాంత మత్స్యకారుల సంక్షేమానికి తెలుగుదేశం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చిస్తోందని, ప్రమాద బీమా పథకంతో పాటు వారి ఆదాయ వనరులు పెంపొందించుకునేందుకు పలు సదుపాయాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సభకు ఎపి ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షత వహిస్తూ ప్రభుత్వ ఆదాయంలో కీలకపాత్ర పోషిస్తున్న మత్స్య పరిశ్రమను అన్నివిధాలా ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సందర్భాల్లో మత్స్యకారులకు ప్రభుత్వం అందించే సహాయం నేరుగా లబ్ధిదారులకే అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పుల్లారావును కోరారు. సభలో ప్రిన్సిపాల్ ఎన్ వీరభద్రరావు, ఎఎంసి ఛైర్మన్ మండవ బాలవర్ధనరావు, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు కోలా హరిశ్చంద్రుడు, మత్యశాఖ అధికారులు పాల్గొన్నారు.