కృష్ణ

సినిమా థియేటర్లలో టికెట్ల మాయాజాలంపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడివాడ, ఆగస్టు 5: గుడివాడ పట్టణంలోని పలు సినిమా థియేటర్లలో టికెట్ల మాయాజాలంపై ప్రత్యేక దృష్టిసారించామని, ఇటీవల విడుదలైన సర్దార్ గబ్బర్‌సింగ్, సరైనోడు వంటి చిత్రాలకు సంబంధించిన టికెట్ల విక్రయాలపై నామమాత్రంగా పన్నులు చెల్లించడాన్ని గుర్తించామని, ఇకపై అలా జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టినట్టు గుడివాడ సిటివో పి జయశంకర్ చెప్పారు. శుక్రవారం స్థానిక సిటివో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. లైసెన్స్ పరిధి బయట ఉన్న వ్యాపారులంతా లైసెన్స్‌లు తీసుకోవాల్సిందేనని, ఈ నెల 15వ తేదీ వరకు వ్యాపారులకు గడువు ఇస్తున్నామని, దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి ధృవీకరణ పత్రాలు, ప్రశ్నలు వేయకుండా 24గంటల్లో లైసెన్స్‌లు ఇస్తామన్నారు. దీనిపై వ్యాపారుల్లో అవగాహన కల్పించేందుకు త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఏడాదికి రూ.7.50లక్షల టర్నోవర్ కల్గిన వ్యాపారులు తప్పనిసరిగా పన్నులు చెల్లించాలన్నారు. పట్టణంలో స్వీట్ షాపులు, మెడికల్ షాపులు, బేకరి, కిరాణా షాపులు, ఫ్యాన్సీ షాపులను పరిశీలించామని, పన్ను పరిధిలో ఉన్నప్పటికీ పన్నులు చెల్లించడం లేదని గుర్తించామన్నారు. ఇప్పటి వరకు 23మంది వ్యాపారులపై కేసులు నమోదు చేశామన్నారు. ప్రతి దుకాణ యజమాని రూ.100ల దాటిన కొనుగోలుకు తప్పనిసరిగా బిల్లు ఇవ్వాలన్నారు. బిల్లు తీసుకోకుంటే మధ్యవర్తులే లాభపడతారన్నారు. పన్ను ఎగవేతదారుల గురించి తమకు సమాచారం అందిస్తే తగిన పారితోషకం అందజేస్తామన్నారు. ఆగస్టు 16వ తేదీ నుండి పన్ను పరిధి బయట ఉండి పన్నుల చెల్లించని వారిని వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు.