కృష్ణ

ఏకాగ్రతకు ఏకలవ్యుడు ఆదర్శం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, ఆగస్టు 9: ఏకలవ్యుడు ద్వారా ఏకాగ్రత, సమభక్తిని ప్రతి వ్యక్తి అలవర్చుకోవాలని, అందుకు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఏకలవ్య విగ్రహావిష్కరణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక హెచ్‌బి కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ భారతంలో ఏకలవ్యుడిది చిన్న పాత్ర అయినా ఆదిమ జాతి నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడన్నారు. నియోజకవర్గ స్థాయిలో సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని, సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎరుకల సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు కుంభా రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రామా వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ తోట శ్యాంకిషోర్ నాయుడు, జెడ్పీటిసి వెంకటేశ్వరరావు, డా. పి కృష్ణదొర, మత్తి శ్రీనివాసరావు, డి గోవర్ధన్, బాలాజీ వర్మ, గోపి, దిడ్ల రాఘవులు, గాజుల మురళి, తదితరులు పాల్గొన్నారు.