కృష్ణ

విద్యార్థుల మృతితో కృష్ణాతీరంలో విషాదఛాయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందర్లపాడు/నందిగామ, ఆగస్టు 16: పుష్కర స్నానం కోసం వెళ్లిన ఐదుగురు విద్యార్థులు ఒకేసారి మృతి చెందడటంతో విద్యార్థుల కుటుంబాలతో పాటు కృష్ణాతీరంలో ల విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికి అంది వస్తారనుకున్న సమయంలో తిరిగిరాని లోకాలకు వెళ్లటంతో ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. పవిత్ర పుష్కరాలు జరుపుకుంటున్న ప్రసుత తరుణంలో ఐదుగురు విద్యార్థులు మృతి జిల్లా వాసులను, నేతలను కలచి వేసింది. నందిగామ చెతన్య కళాశాలలో బికాం ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులు 11 మంది చందర్లపాడు మండలం ఏటూరు వద్ద ఉన్న కృష్ణా నదికి వెళ్లారు. స్నానానికి వెళ్లిన విద్యార్థులు నందిగామకు చెందిన కూచి లోకేశ్వరసాయి సూర్యగోపాల్, కమ్మవరపు హరిగోపి, చరువుకొమ్ముపాలెంకు చెందిన పాశం గోపిరెడ్డి, జయంతి గ్రామానికి చెందిన నగేష్, చందర్లపాడు మండలం తోటరావులపాడుకు చెందిన ములకలపల్లి హరీష్‌తోపాటు ఇంకా ఆరుగురు కలిసి నది వద్దకు చేరుకున్నారు. అక్కడ విద్యార్థులలో ఒకరి తండ్రి ఉండటంతో తమను చూస్తాడని దూరంగా వెళ్లి నదిలోకి దిగారు. నదిలో లోతు ఎక్కువగా ఉండటంతో ముందు దిగిన ఐదుగురు మునిగిపోయారు. విషయం తెలియగానే నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కోట వీరబాబు, జెడ్‌పిటిసి వాసిరెడ్డి ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు వేగవంతం చేశారు. సంఘటన జరిగిన స్థలం గుంటూరు జిల్లా సరిహద్దు కావటంతో గుంటూరు జిల్లా ఐజి సంజయ్, కృష్ణా జిల్లా ఎస్‌పి విజయ్‌కుమార్, సబ్ కలెక్టర్ సృజన ఆధ్వర్యంలో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను పిలిపించి గాలింపు చేపట్టారు. పడిన చోటే మృతదేహాలు దొరికాయి. మృతదేహాలను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు.