విజయవాడ

పేదరిక నిర్మూలనకే ‘సర్వే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం/ మైలవరం, ఆగస్టు 19: పేదరిక నిర్మూలనకే రాష్ట్రంలో స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహిస్తున్నామని, ఇందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. కృష్ణా పుష్కరాల ఎనిమిదో రోజైన శుక్రవారం ఆయన ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మకు హారతినిచ్చే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. శుక్రవారం డ్వాక్రా అంశంపై జరిగిన చర్చాగోష్టిలో పలువురిని ఆయన అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాల వల్ల పేదరిక నిర్మూలన తాత్కాలికంగానే సాధ్యమవుతోందని, స్మార్ట్ పల్స్ సర్వే ద్వారా శాశ్వతంగా దానిని నిర్మూలించటానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. పేదరిక నిర్మూలన చేయటానికి ఈ డేటాలోని అంశాలు ఉపయోగపడతాయని తద్వారా అసలైన పేదలకు ఏ సంక్షేమ పధకాలు అమలుచేయాలో అర్థమవుతోందని, ఎవరి ప్రమేయం లేకుండా, సిఫార్సు లేకుండా పథకాలు నేరుగా పేదలకు అందుతాయన్నారు. ఈ సర్వేపై వస్తున్న దష్ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. పేదరికంపై గెలుపును సాధించేవరకూ తాను విశ్రమించేది లేదన్నారు. సాంకేతిక పరిఙ్ఞనాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకూ నిత్యావసర వస్తువులను ఎక్కడైనా తీసుకుంటున్నట్లుగానే ఫించన్లు కూడా తీసుకునే విధంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విభజన అనంతరం రాష్ట్రంలో సమస్యలున్నాయని అంత మాత్రాన పేదలను విస్మరించేది లేదన్నారు. రైతులకు 24వేల కోట్ల రూపాయల రుణమాఫీకి సిద్ధంగా ఉన్నామని ఇప్పటి వరకూ 10వేల కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగిందన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికీ 10వేల రూపాయలు ఇవ్వటానికి నిర్ణయించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంగా 1976కోట్ల రూపాయలను విడుదల చేసిందని ఇది ఎంత మాత్రం సరిపోదని, ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తామని కృష్ణమ్మ సాక్షిగా ప్రమాణం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు సాంకేతిక పరిఙ్ఞనాన్ని వినియోగించుకుంటున్నామని సిసి కెమేరాలు, డ్రోన్‌ల సాయంతో నేరస్తులను క్షణాల్లోనే పట్టుకుంటున్నామన్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారిని ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో రౌడీయిజానికి తావు లేదని, అసాంఘిక శక్తులను అణచివేస్తామని ఆయన పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో ఫైనల్స్‌లో తలపడుతున్న సింధు విజయవాడ బిడ్డకావటం గర్వకారణమని క్రీడలకు సంబంధించి సరైన వసతులు, సౌకర్యాలు కల్పిస్తే అటువంటి సింధులు చాలా మంది ఉంటారన్నారు. ఈసందర్భంగా సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో మంత్రులు పల్లె రఘునాధరెడ్డి, కామినేని శ్రీనివాస్, అచ్చెంనాయుడు, దేవినేని ఉమ, రావెల కిషోర్, అయ్యన్నపాత్రుడు, ఎంపి కేసినేని నాని, ఎంపి కింజెరాపు రామ్మోహన్‌నాయుడు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ తదితరులు పాల్గొన్నారు.