కృష్ణ

ఘనంగా దుర్ముఖ ఉగాది వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, ఏఫ్రిల్ 8: తెలుగువారిది ప్రత్యేకమైన సంస్కృతి అని, ప్రపంచంలో ఏక్కడ ఉన్న తెలుగు జాతి గర్వించదగినది, శక్తివంతమైనదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు పురస్కరించుకొని శుక్రవారం ఉదయం స్థానిక గురునానక్ కాలనీ ఎన్‌ఏసి కల్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది పురస్కారాల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ దుర్ముఖి నామ సంవత్సరంలో నవ్యాంధ్ర ప్రజలు అత్యంత సుఖ సంతోషాలు, పాడి పంటలతో తులతూగాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రజలది ఆత్మగౌరవం, కష్టపడే మనస్థత్వమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత దక్షణ భారతదేశంలో 5 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయంలో వెనుకబడి ఉందన్నారు. మత సామరస్యంతోనే ప్రగతి సాథ్యమని తెలిపారు. పేదరికం లేని సమాజం చూడాలనేది తన తపన అన్నారు. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్లులాంటివన్నారు. ప్రజల కోసం సేవకుడిలా పనిచేస్తానని మరోసారి స్పష్టం చేశారు. తెలుగువారు దేశంలో ఎక్కడకి వెళ్లిన వ్యవసాయానికి పెద్దపీట వేశారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే వ్యవసాయంతోపాటు, పారిశ్రామిక అభివృద్ధి జరిగితేనే రాష్ట్రం ముందుకెళుతుందన్నారు. ప్రపంచంలో ఎక్కడలేని విధంగా అమరావతి రాజధాని నిర్మాణం కోసం 33వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు పాదాభివందనమని, వారికి ఉగాది శుభాకాంక్షలు ఆయన తెలిపారు. వచ్చే జూలై మాసాంతానికి 149 రూపాయలకే ప్రతి ఇంటికి ఇంటర్‌నెట్ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. వచ్చే మూడు సంవత్సరాలలోపు రాష్ట్రంలోని 15 లక్షల మంది రైతులకు విద్యుత్ ఆదాతోపాటు, నాణ్యతతో కూడిన పంపుసెట్లు అందజేస్తామని చెప్పారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. శుక్రవారం నుండే ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నానని ప్రకటించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడుతూ ఉగాది పచ్చడి మనిషి జీవితాన్ని ప్రతిభింబిస్తుందన్నారు. ఒకరి కోసం అందరం, అందరికోసం ఒకరుగా జీవించాలన్నారు. సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కష్టాలు చూసి కృంగిపోకూడదని, విజయాలు చూసి ఉప్పంగి పోకూడదన్నారు. కష్టపడితే సాధించలేనిది ఏమి ఉండదన్నారు. శాసనమండిలి ఛైర్మన్ చక్రపాణి మాట్లాడుతూ శక్తివంతమైన తెలుగుజాతి పాడిపంటలు, సౌభాగ్యంతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. సమాచార శాఖ, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి మాట్లాడుతూ తెలుగుజాతి సంస్కృతి, సంప్రదాయాలను ప్రభుత్వం పరిరక్షిస్తుందన్నారు. వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రొత్సహిస్తుందన్నారు. తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించటానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ ఇక నుండి దేవాలయాలలో ఏడు రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం జరుగుతుందన్నారు. అనంతరం వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన 23మందికి 50 వేల నగదు, హంస మెమొంటో, శాలువా, ప్రశంసాపత్రంతో కళారత్న ఉగాది పురస్కారంతో సిఎం ఘనంగా సత్కరించారు. అలాగే వివిధ రంగాలలో ప్రతిభ కనబరించిన 53 మందిని 10 వేల నగదు, ప్రసంశ పత్రం, శాలువా, మెమొంటోతో సిఎం ఘనంగా సత్కరించారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవసాయ విధివిధానాలతో కూడిన పంచాంగం, టిటిడి పంచాగం, పకృతి వ్యవసాయం పాలేకర్ ఉపన్యాసం సిడిని ఆవిష్కరించారు. కార్యక్రమం ప్రారంభంలో పొన్నలూరి శ్రీనివాస గార్గేయ ఉగాది పంచాంగ శ్రవణం, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగం అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఇ.కృష్ణమూర్తి, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ఆరోగ్య వైద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎపి టిడిపి అధ్యక్షుడు కళావెంకట్రావ్, పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్, మురళీకృష్ణ, కేశినేని నాని, శాససభ్యులు గద్దె రామమోహన్, బొండా ఉమ, ఎమ్మెల్సీలు, మేయర్ కోనేరు శ్రీ్ధర్, కలెక్టర్ బాబు ఎ, విఎంసి కమిషనర్ వీరపాండియన్, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.