కృష్ణ

చరిత్ర సృష్టించిన నిత్యహారతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం/ మైలవరం, ఆగస్టు 23: కృష్ణమ్మకు నిత్యహారతి కార్యక్రమం చరిత్ర సృష్టించిందని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకల్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ పూర్వీకులు రంగరించి ఇచ్చిన వారసత్వ సంప్రదాయాలు మనం ఆచరించాలన్నారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కృష్ణా హారతిని తిలకించిన అందరికీ మానసిక ఉల్లాసం కలిగిందన్నారు. నిత్యజీవితంలో సుఖసంతోషాలు ఉండాలని, ఇందుకు నదులు దోహదం చేస్తాయన్నారు. మనిషికి జీవజలం అందిస్తున్న నదులకు హారతులివ్వడంతో రుణం తీర్చుకున్నట్టే అవుతుందన్నారు. నదులను పూజిస్తే పుణ్యం, పురుషార్థం లభిస్తాయన్నారు. పుష్కరాల ఏర్పాట్లు అమోఘంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికత, ముందుచూపు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు కష్టపడి ఒలింపిక్స్‌లో విజేతగా నిలిచి ఈ స్థాయికి చేరుకోవడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణమన్నారు. యువత సింధు విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలన్నారు. శారీరక శ్రమతో జీవితాలను సుఖమయం చేసుకోవాలన్నారు. పివి సింధును విజేతగా మలిచిన పుల్లెల గోపిచంద్‌ను ప్రత్యేకంగా అభినందించారు.