కృష్ణ

ముగింపు వేడుకలు అదుర్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం/ జి.కొండూరు, ఆగస్టు 23: కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకలో కూచిపూడి కళాకారుల నృత్య ప్రదర్శన చూపరులను సమ్మోహితుల్ని చేసింది. చూసేందుకు రెండు కళ్లూ చాలనట్టుగా కూచిపూడి కళాకారులు లయబద్ధంగా నర్తించారు. వెయ్యి మంది ఔత్సాహిక కళాకారులు ఒకే వేదికపై చేరి ఐదు నిముషాలు భక్తులకు మనోల్లాసం కలిగించారు. కృష్ణమ్మకు కృతజ్ఞతలు తెలుపుతూ పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో కూచిపూడి నాట్యారామం అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ పర్యవేక్షణలో నాట్యమయూరులు నృత్యం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సురేష్ ప్రభు, గణపతి సచ్చిదానందస్వామి, ఒలింపిక్స్ పతక విజేత పివి సింధు, తదితర ప్రముఖుల సమక్షంలో, అశేష భక్తజన సందోహం మధ్య, చల్లని కృష్ణమ్మ ఒడ్డున కూచిపూడి ప్రదర్శన రికార్డు స్థాయిలో జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడికి మరింత గుర్తింపు తెస్తానని, కూచిపూడి నాట్యకళను పరిరక్షించడానికి రూ.100 కోట్ల నిధితో సంస్థను ఏర్పాటు చేశామని, భవిష్యత్‌లో మరింత ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసందర్భంగా చెప్పారు. భారతీయ సంసృతి, సంప్రదాయాలు వెల్లివిరిసేలా కూచిపూడి నాట్యకళ కృష్ణా జిల్లాలోనే పుట్టిందన్నారు. డిసెంబరులో 10వేల మంది కళాకారులతో మెగా ప్రోగ్రామ్ నిర్వహించాలని సూచించారు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నట్లుగా 10 నుంచి 25 ఏళ్లలోపు వయసున్న వెయ్యి మంది కూచిపూడి కళాకారులు శోభాయమానంగా నాట్యవిందును అందచేశారు. తమ నాట్యవిన్యాసాలతో కృష్ణమ్మకు నీరాజనాలు అర్పించారు. అంతకుముందు కృష్ణానదిలో తేలుతూ జలమత్స్య ఆసనంతో యోగాగురువు అరుణ కృష్ణమ్మకు హారతినిచ్చి యాత్రికుల అభిమానం చూరగొన్నారు. కూచిపూడి నాట్యాన్ని మద్దాలి ఉషాగాయత్రి, పి శేషుబాబు (హైదరాబాద్) ప్రదర్శించగా, సంగీతం నండూరి కృష్ణస్వామి, ఆర్కెస్ట్రా మాజేటి రామకృష్ణ, జానపద గీతాలను కె శేషగిరి, అన్నమాచార్య కీర్తనలను కొండవీటి జ్యోతిర్మయి ఆలపించారు.