కృష్ణ

వైభవంగా అమ్మవారి వెండి రథోత్సవ ఊరేగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి (విజయవాడ) ఏప్రిల్ 8: తెలుగువారి దుర్ముఖి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా శుక్రవారం సాయంత్రం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారి వెండి రథోత్సవ ఊరేగింపు పాతబస్తీలో ఘనంగా జరిగింది. తొలుత దుర్గగుడి స్థానాచార్యుడు విష్ణుబొట్ల శివప్రసాద్, ప్రధాన అర్చకుడు లింగంబొట్ల దుర్గా ప్రసాద్ నిష్ఠగా ఇన్‌చార్జ్ ఇవో యస్‌యస్‌యస్ చంద్రశేఖర్ అజాద్‌చేత ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి వెండిరథం ముందు భేతాళ నృత్యాలు, పులివేషాలు, కోలాటం, సంకీర్తన, భజనలు కళకారులు ప్రదర్శిస్తుండగా ఆంధ్రుల ఇలువేల్పులుగా భక్తకోటి నుండి నిత్య పూజలు అందుకొంటున్న శ్రీకనకదుర్గమ్మ వెండిరథాన్ని అధిష్టించి భక్తకోటికి దివ్యదర్శనం ఇచ్చేందుకు జమ్మిదొడ్డి సెంటర్ నుండి బయలు దేరింది. ఈ ఊరేగింపు పాతబస్తీలోని వివిధ వీధుల గుండా సుమారు 4గంటపాటు సాగి తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకుంది. తెలుగువారి తొలి పండుగైన ఉగాదినాడు భక్తులు అమ్మవారిని దర్శించుకోవటానికి ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. శ్రీ మల్లిఖార్జున మహామండపం 6వ బ్లాక్‌లో ఇన్‌చార్జ్ ఇవో యస్‌యస్‌యస్ చంద్రశేఖర్ అజాద్ ఆదేశాల మేరకు ఆలయ సహాయ ఇవోలు శ్రవణం అచ్యుతరామయ్యనాయుడు, బి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి మల్లెలతో పుష్పార్చన నిర్వహించారు. సాయంత్రం 5గంటలకు శ్రీ మల్లిఖార్జున మహామండపంలో పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు భక్తులకు పంచాంగాలను పంపిణీ చేశారు.