కృష్ణ

ఖరీదైన వైద్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 26: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ అన్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచిత డయాలసిస్ సెంటర్‌ను శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కామినేని మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో డయాలసిస్ వంటి ఖరీదైన వైద్య సదుపాయాన్ని తీసుకు వచ్చామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. రూ.2 వేలు ఖర్చయ్యే ప్రతి డయాలసిస్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గించిన రాష్ట్రంగా గుర్తింపు పొందినట్లు చెప్పారు. మరికొన్ని రోజుల్లో 35 సంవత్సరాలు దాటిన మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ విభాగం 150 పడకలతో నిర్మించిన భవనాన్ని అక్టోబర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఔట్ పేషంట్ల సంఖ్య, ప్రసవాల సంఖ్య భారీగా పెరిగాయన్నారు. రానున్న రోజుల్లో ఆస్పత్రిని మరింత అభివృద్ధి పరుస్తామన్నారు. బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ గత పదేళ్ళల్లో వైద్య రంగం కుంటుపడిన నేపథ్యంలో తమ ప్రభుత్వం సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ దిశగా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద వెయ్యి రకాల రోగాలకు ఉచిత వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు. చిన్నాపురం, తాళ్ళపాలెం పిహెచ్‌సిలు నూతనంగా ఏర్పాటు చేశామన్నారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ జిల్లాలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు అధికంగా జరిగిన ఆస్పత్రి మన ఆస్పత్రి కావడం గర్వంగా ఉందన్నారు. ప్రతి రోజూ ఓపిలో 1200 మంది రోగులు వస్తున్నారని, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రసవాలకు రూ.50 వేలు నుండి లక్ష వరకు ఖర్చయ్యే పరిస్థితులు ఉన్నాయన్నారు. కానీ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రావీణ్యం గల వైద్యులు ఉచితంగా ప్రసవాలు చేస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, వైద్య ఆరోగ్య కుటుంబ శాఖ కమిషనర్ ఐ శామ్యూల్ ఆనంద కుమార్, వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. బికె నాయక్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య), జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.