కృష్ణ

క్రీడాభివృద్ధికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 28: క్రీడాభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఇండోర్ స్టేడియం నిర్మాణ కార్యాచరణ సమితి సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి కొల్లు రవీంద్ర స్టేడియం నిర్మాణానికి అవసరమైన సూచనలు, సలహాలను పట్టణ ప్రముఖుల నుండి తీసుకున్నారు. అన్ని వసతులతో కూడిన స్టేడియంను త్వరలో నిర్మించనున్నట్లు తెలిపారు. నిర్మాణానికి అవసరమైన స్థలానే్వషణ జరుగుతుందన్నారు. విద్యతో పాటు క్రీడల పట్ల కూడా విద్యార్థులు మక్కువ కనబర్చారు. ప్రతి ఒక్క క్రీడాకారుడు ఒలంపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన పివి సింధూను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో మచిలీపట్నంను క్రీడా గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సమావేశంలో పట్టణ ప్రముఖులు యార్లగడ్డ శివరామ ప్రసాద్, గొరిపర్తి పాపరాజు, కుందేటి మోహనరావు, అచ్యుతరామయ్య, డా. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.