కృష్ణ

నూజివీడులో సెంట్రల్ జైల్ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, ఆగస్టు 30:రాష్ట్ర విభజన అనంతరం నూజివీడులో సెంట్రల్ జైలు ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్లు జైళ్ళ శాఖ ఐజి ఎం చంద్రశేఖర్ చెప్పారు. సెంట్రల్ జైలు ఏర్పాటుకు కనీసం 150 ఎకరాల స్ధలం అవసరం అవుతుందని అన్నారు. నూజివీడు జైలును ఐజి చంద్రశేఖర్ మంగళవారం పరిశీలించారు. రికార్డులు పరిశీలించి, జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీలతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నూతన రాష్ట్ర ఆవిర్భావంతో కొత్తగా సెంట్రల్ జైలును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నూజివీడు ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఉన్నాయని, వీటిలో 150 ఎకరాలు కేటాయించి, సెంట్రల్ జైలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని, ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని ఆయన వివరించారు. ప్రభుత్వం అనుమతించి, నిధులు కేటాయిస్తే దీనిని నిర్మించటం కనీసం అయిదు సంవత్సరాలు పడుతుందని చెప్పారు. రాష్ట్రంలో నేరాలకు పాల్పడి వివిధ జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలలో మానసిక పరివర్తనకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. యోగా తరగతులు నిర్వహిస్తున్నామని, ఇవి మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలపై కూడా సమాచారం తీసుకున్నామని, అందరూ సంతృప్తిగా ఉన్నారని అన్నారు. అంతకు ముందు జైళ్ళ అధికారులతో ఐజీ చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈయన వెంట జిల్లా జైళ్ళ అధికారి నబీఖాన్, స్థానిక సూపరింటెండెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.