కృష్ణ

కుంభవృష్టితో స్తంభించిన జనజీవనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ/ జగ్గయ్యపేట రూరల్/ కంచికచర్ల, ఆగస్టు 30: నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతంలో మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకూ ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జన జీవనం స్తంభించింది. గ్రామాల పరిధిలో ఉన్న వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు ఈ భారీ వర్షంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు పొలాల్లో వర్షపునీరు నిలిచిపోయింది. డ్రైన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. నందిగామ పాత బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. నందిగామ ఫైర్ స్టేషన్‌లోకి వర్షపు నీరు చేరుకోవడంతో సిబ్బంది ఇబ్బందులు పడ్డారు. నందిగామ - మధిర రహదారి మధ్య పల్లగిరి గట్టు సమీపంలో భారీ వర్షానికి చెట్టు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రావెల్ రోడ్లు బురదమయంగా మారడంతో ద్విచక్ర వాహనచోదకులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.