కృష్ణ

నష్టాలలో నడుస్తున్న పాడి పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, సెప్టెంబర్ 13: పాడి పంటలకు అవినాభావ సంబంధం తరాలుగా సాగుతోంది. పాడి పరిశ్రమ ఆధారంగా కుటుంబాలను నెట్టుకొచ్చి తమ సంతానం ఉన్నత స్థానాలు అధిష్టించడానికి కృషి చేసిన తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పాడి పరిశ్రమ ప్రస్తుతం కష్ట నష్టాలలో కొట్టుమిట్టాడుతోంది. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గుముఖం పట్టింది. నియోజకవర్గంలో దాదాపు 15వేలకు పైగా పాడి పశువులు ఉన్నట్లు పశు సంవర్ధకశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పశు పోషణ ఖర్చు గణనీయంగా పెరగడమే పాల ఉత్పత్తి తగ్గటానికి ప్రధాన కారణంగా రైతులు చెబుతున్నారు. గతంలో వ్యవసాయానికి అనుబంధంగా పశు పోషణ జరిగేది. పండించిన పంటను పశువులకు దాణాగా వినియోగించేవారు. ఇప్పుడు రైతులు వ్యవసాయానికి క్రమేపి దూరం కావటమే కాక యంత్రాల ద్వారా కోత కోయించటంతో పశువుల మేతను పూర్తిగా బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లీటరు పాల ఉత్పత్తికి రూ.30 ఖర్చు అవుతుందని అంచనా, పాలల్లో ఏడు శాతం వెన్న ఉంటే లీటరుకు రూ.35 గిట్టుబాటు అవుతుంది. వెన్నశాతం తగ్గితే రైతు తిరిగి నష్టపోవాల్సిన పరిస్థితి. వాతావరణ పరిస్థితులు కూడా పాల దిగుబడి తగ్గటానికి ప్రధాన కారణమని పశు వైద్యులు పేర్కొంటున్నారు. కొద్ది రోజులు క్రితం క్వింటాల్ తవుడు రూ.1600 విక్రయించగా ఒక్క సారిగా రూ.2,300లకు పెరిగింది. దీనితో పాటు దాణా ధరలకు కూడా లెక్కలొచ్చాయి. రూ.625కు లభించే దాణా ప్రస్తుతం రూ.870కి విక్రయిస్తున్నారు. సజ్జలు రూ.25, జొన్నలు రూ.32, ఉలవలు రూ.26, ఎకరం వరి గడ్డి రూ.8వేలు ధర పలకటంతో రైతులకు భారంగా మారిందని వాపోతున్నారు.