కృష్ణ

ఘనంగా బక్రీద్ వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 13: పట్టణంలో బక్రీద్ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పలు మసీదులలో ముస్లింలు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం పేదలకు పండ్లు, రొట్టెలు, వస్త్రాలు, నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈద్గాహ్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం మైనార్టీ వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. 3 ఎకరాల విస్తీర్ణం గల ఈద్గాహ్‌లోని ఒక ఎకరం స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఇమామ్ మాజిద్ హుస్సేన్ ప్రత్యేక నమాజు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగానికి ప్రతీక అన్నారు. తల్లిదండ్రులను పూజించాలని, వృద్ధులను, వితంతువులను ఆదుకోవాలని, పెద్దలను గౌరవించాలన్నారు. అనంతరం ఛైర్మన్ బాబాప్రసాద్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈద్గాహ్ అధ్యక్ష, కార్యదర్శులు యండి రఫీ, అస్రఫ్ పాషా, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ అధికారి సదృద్దీన్ ఖురేషి, యండి మీరాజుద్దీన్, పట్టణ టిడిపి అధ్యక్షులు ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు.