కృష్ణ

వీరాయలంకలో వరి పొలాల మునక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, సెప్టెంబర్ 22: మొవ్వ మండలం శివారు వీరాయలంక వద్ద జాతీయ రహదారి పక్కన ఉన్న 100 ఎకరాల వరి పైరు నీట మునగటంతో రైతులు అల్లాడుతున్నారు. మేనేజర్ మెయిన్ ఛానల్ ద్వారా వీరాయలంక పంట కాలువ ద్వారా కృష్ణా జలాలతో పాటు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ఒకేసారి విడుదల కావటం, మూడు రోజుల నుండి వర్షం కురవటం, డ్రైనేజీ వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటంతో పంట పొలాలు నీట మునిగాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రకృతి కనె్నర్ర చేస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనావృష్టితో తీవ్రంగా ఇబ్బంది పడి రైతులు సాగు చేసిన వరి పైరు కళ్ల ముందే నీట మునగటంతో దీనంగా మారిన పొలాలను చూసి ఆందోళన చెందుతున్నారు. కొంతకాలంగా ముంపునకు గురిచేస్తున్న పంట కాలువకు మరమ్మతులు చేపట్టాలని రైతులు గత దశాబ్దకాలంగా చేస్తున్న విజ్ఞప్తిని ఇరిగేషన్ శాఖాధికారులు నిర్లక్ష్యం చేయటంతో ఈ సమస్య ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పంట కాలువను మరమ్మతులు చేయాలని కోరుతున్నారు. మూడు రోజుల భారీ వర్షాలకు కూచిపూడి శివారు ఇందిరానగర్‌లోని రెండు ఇళ్లు నీట మునిగాయి.