కృష్ణ

జిల్లాలో సరాసరి 43.0 మి.మీల వర్షపాతం నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 22: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా బుధవారం అర్ధరాత్రి నుండి గురువారం తెల్లవారుఝాము వరకు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాలో 43.0 మి.మీల సరాసరి వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పెడన మండలంలో 150.6 మి.మీలు, అత్యల్పంగా తిరువూరులో 6.8 మి.మీల వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంట కాలువలు నిండుగా ప్రవహిస్తున్నాయి. పులిచింతలకు ప్రాజెక్టుకు భారీగా వర్షపునీరు చేరటంతో నీటిమట్టం 29.1 టిఎంసిలకు చేరుకుంది. ప్రకాశం బ్యారేజీ నుండి భారీగా సముద్రంలోకి నీటిని విడుదల చేయటంతో జిల్లా కలెక్టర్ బాబు.ఎ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. వరద ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కంట్రోల్ రూమ్ నం. 08672- 252572 ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ప్రజలు నేరుగా కంట్రోల్ రూమ్‌కు గానీ, టోల్ ఫ్రీ నెంబరు 1077కు ఫోన్ చేసి తెలియచేయాలని కలెక్టర్ బాబు.ఎ వరద బాధితులకు సూచించారు. వరద ఉద్ధృతి తగ్గేవరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో క్షేత్ర పర్యటనలు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను నివేదించాలని ఆదేశించారు. బందరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయ. జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు మండలాల వారీగా ఇలా ఉన్నాయ.
మండలాల వారీగా వర్షపాతం వివరాలు
జగ్గయ్యపేట 68.4
వత్సవాయి 21.4
పెనుగంచిప్రోలు 25.4,
నందిగామ 68.6
చందర్లపాడు 32.0
కంచికచర్ల 24.6
వీరుళ్ళపాడు 22.8
ఇబ్రహీంపట్నం 46.4
జి.కొండూరు 22.6
మైలవరం 16.4
ఎ.కొండూరు 25.0
గంపలగూడెం 13.4
తిరువూరు 6.8
విస్సన్నపేట 38.6
రెడ్డిగూడెం 18.4
విజయవాడ రూరల్ 30.4
విజయవాడ అర్బన్ 30.4
పెనమలూరు 17.6
తోట్లవల్లూరు 29.2
కంకిపాడు 24.8
గన్నవరం 15.2
ఆగిరపల్లి 12.6
నూజివీడు 14.2
చాట్రాయి 79.2
ముసునూరు 23.8
బాపులపాడు 15.6
ఉంగుటూరు 18.2
ఉయ్యూరు 23.4
పమిడిముక్కల 33.6
మొవ్వ 66.8
ఘంటసాల 51.4
చల్లపల్లి 64.2
మోపిదేవి 42.8
అవనిగడ్డ 74.4
నాగాయలంక 56.8
కోడూరు 52.6
మచిలీపట్నం 86.2
గూడూరు 148.2
పామర్రు 90.2
పెదపారుపూడి 38.2
నందివాడ 39.2
గుడివాడ 54.5
గుడ్లవల్లేరు 106.0
పెడన 150.6
బంటుమిల్లి 41.4
ముదినేపల్లి 47.8
మండవల్లి 26.8
కైకలూరు 18.0
కలిదిండి 22.8
కృత్తివెన్ను 40.0
మొత్తం 43.0 మి.మీ (సరాసరి)