కృష్ణ

అన్నీ అనుమానాలే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, సెప్టెంబర్ 24: బందరు ఓడరేవు, పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం ప్రభుత్వం జారీ చేసిన ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌పై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. భూములిచ్చే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ మెరుగ్గా ఉన్నప్పటికీ అది అసలైన రైతులకు అందుతుందా? లేదా? అనేది సందేహాస్పదంగా మారింది. బందరు ఓడరేవు, పారిశ్రామికవాడ ఏర్పాటుకు 33వేల 327 ఎకరాల భూములను సమీకరించేందుకు ఐదురోజుల క్రితం ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) అధికారులు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో నోటిఫికేషన్ ప్రతులు పెట్టారు. సర్వే నెంబర్లు, అనుభవదారుల పేర్లతో కూడిన నోటీసులను పంచాయతీ కార్యాలయాల్లో పొందుపర్చారు. వీటిని చూసిన రైతులు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న సర్వే నెంబర్లు, రైతుల పేర్లలో పెద్దఎత్తున తప్పులు దొర్లాయని పలువురు రైతులు అంటున్నారు. 20 ఏళ్ల క్రితం భూములు కొనుగోలు చేసినా నేటికీ అడంగల్‌లో పేర్లు మార్చకపోవటం పెద్ద సమస్యగా మారింది. అధికారులు జారీ చేసిన నోటిఫికేషన్‌లో పాత రైతుల పేర్లే దర్శనమిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్యాకేజీ ఎవరికి ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ తప్పులను చాలామంది రైతులు జీర్ణించుకోలేక పోతున్నారు. అనుభవదారులుగా తమను చూపకుండా పాత యజమానులను చూపించడంలో అంతర్యమేమిటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రశ్నిద్దామని ఒకరిద్దరు రైతులు ఆర్డీవో కార్యాలయానికి వస్తున్నా అధికారులు వారి సందేహాలను నివృత్తి చేయకుండా పంపించేస్తున్నారు. ఎలాంటి సందేహాలనైనా గ్రామసభల దృష్టికి తీసుకురావాలని ఓ డివిజన్ స్థాయి అధికారి పేర్కొనడం గమనార్హం. కనీసం గ్రామసభల షెడ్యూల్ వివరాలు కూడా ఆర్డీవో కార్యాలయంలో ఇవ్వడం లేదనే ఆరోపణలు రైతుల నుండి వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ఈ నెల 27 నుండి అక్టోబర్ 4 వరకు జరిగే గ్రామసభల పట్ల ఉత్కంఠ నెలకొంది. రైతుల నుండి అంగీకార పత్రాలు, అభ్యంతరాలు తీసుకునేందుకు గ్రామసభలు నిర్వహించనున్నారు. చాలామంది రైతులు అంగీకార పత్రాలకన్నా అభ్యంతరాలు తెలియచేసేందుకే మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. తమ అభ్యంతరాలను తెలియచేయటంతో పాటు నోటిఫికేషన్ లోటుపాట్లపై అధికారులను నిలదీసేందుకు రైతులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

జిల్లాలో 12.7 మి.మీల వర్షపాతం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 24: జిల్లాలో సరాసరి వర్షపాతం 12.7 మి.మీలుగా నమోదైంది. శుక్రవారం ఉదయం 8గంటల నుండి శనివారం ఉదయం 8గంటల వరకు ఈ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అత్యధికంగా చాట్రాయి మండలంలో 84.2 మి.మీలు, అత్యల్పంగా మొవ్వలో 1.0 మి.మీల వర్షపాతం నమోదైంది. పెదపారుపూడి, బంటుమిల్లి, మండవల్లి మండలాల్లో ఎలాంటి వర్షపాతం నమోదు కాలేదు. మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గయ్యపేట మండలంలో 10.2 మి.మీలు, వత్సవాయి 8.6, పెనుగంచిప్రోలు 9.2, నందిగామ 17.8, చందర్లపాడు 6.8, కంచికచర్ల 10.8, వీరుళ్ళపాడు 28.6, ఇబ్రహీంపట్నం 10.8, జి.కొండూరు 19.4, మైలవరం 32.2, ఎ.కొండూరు 69.2, గంపలగూడెం 19.4, తిరువూరు 11.2, విస్సన్నపేట 54.2, రెడ్డిగూడెం 58.4, విజయవాడ రూరల్, అర్బన్ 8.2, పెనమలూరు 10.2, తోట్లవల్లూరు 2.2, కంకిపాడు 6.2, గన్నవరం 17.2, ఆగిరపల్లి 8.4, నూజివీడు 17.8, ముసునూరు 23.0, బాపులపాడు 10.6, ఉంగుటూరు 3.4, ఉయ్యూరు 3.2, పమిడిముక్కల 3.2, ఘంటసాల 3.6, చల్లపల్లి 1.4, మోపిదేవి 3.4, అవనిగడ్డ 3.6, నాగాయలంక 5.8, కోడూరు 4.6, మచిలీపట్నం 5.8, గూడూరు 2.4, పామర్రు 4.0, నందివాడ 1.4, గుడివాడ 3.4, గుడ్లవల్లేరు 4.0, పెడన 2.8, ముదినేపల్లి 2.0, కైకలూరు 2.2, కలిదిండి 2.8, కృత్తివెన్నులో 5.4 మి.మీల చొప్పున వర్షపాతం నమోదైందని అధికారులు వివరించారు.