కృష్ణ

శ్రీ కొండలమ్మ ఆలయంలో దేవీనవరాత్రుల కరపత్రాలు ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుడ్లవల్లేరు, సెప్టెంబర్ 25: మండల పరిధిలోని వేమవరం గ్రామంలో వేంచేసి వున్న శ్రీ కొండలమ్మ అమ్మవారి ఆలయంలో అక్టోబరు 1 నుండి 11వ తేదీ వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జివిడిఎన్ లీలాకుమార్ ఆదివారం తెలిపారు. ఈసందర్భంగా పదకొండు రోజులూ అమ్మవారికి విశేష అలంకారాలు చేస్తున్నట్లు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా 11 రోజులు సాంఘిక, పౌరాణిక, జానపద, కూచిపూడి నృత్యాలు, హరికథా కాలక్షేపాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుల సౌకర్యార్థం ఉత్సవ భక్తజన సేవా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కమిటీలో బి ఏడుకొండలు, చాపరాల రాజేశ్వరరావు, సూరపనేని పరంధామయ్య, కానూరి సత్యనారాయణ ప్రసాద్, మాదాసు వెంకట శివరామ కృష్ణప్రసాద్, మనె్నం సత్యనారాయణ, పామర్తి శ్రీనివాసరావు, చిట్టిబొమ్మ వెంకట నరసమ్మ, కొప్పినేని సుబ్బారావు సభ్యులుగా ఉంటారన్నారు. ఈసందర్భంగా ఉత్సవానికి సంబంధించిన పోస్టర్లను ఆలయ ఆవరణలో ఆవిష్కరించారు.

బందరు డివిజన్ ఫొటో, వీడియోగ్రాఫర్స్
అసోసియేషన్ పిఆర్వోగా కోకా మహేష్
మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 25: బందరు డివిజన్ ఫొటో, వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిఆర్వోగా కోకా మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక అన్నం వీరరాఘవయ్య, రాఘవరావు కల్యాణ మండపంలో ఆదివారం జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో మహేష్ ఎన్నిక జరిగింది. గత 25 సంవత్సరాలుగా ఫొటోగ్రఫీలో విశేష సేవలు అందిస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందిన మహేష్ గతంలోనే అనేక పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన వెనె్నల సాహితీ సాంస్కృతిక సంస్థ మహేష్‌కు ఛాయాచిత్రరత్న బిరుదును ప్రదానం చేసింది. ఫొటోగ్రఫీలో మహేష్ సేవలను గుర్తించిన అసోసియేషన్ ఆయనకు పిఆర్వోగా బాధ్యతలు అప్పగించింది. మహేష్ ఎన్నిక పట్ల పలువురు ఫొటోగ్రాఫర్లు హర్షం వ్యక్తం చేశారు.