కృష్ణ

గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదార్లకు ప్రథమ ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 25: గ్రామాల్లో వౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా అంతర్గత రహదారులు నిర్మించడానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. తాళ్ళపాలెం పంచాయతీ పరిధిలోని సత్తెనపాలెం దళితవాడకు ఎన్‌పిఆర్‌ఎంపి పథకం కింద రూ.56 లక్షల వ్యయంతో చేపట్టిన తారురోడ్డు నిర్మాణానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ గ్రామీణ డొంక రోడ్ల నిర్మాణానికి, అన్ని రహదారుల నిర్మాణానికి ఎక్కువగా ఉపాధి హామీ నిధులను ఖర్చు చేసినట్లు తెలిపారు. చిన్నాపురం నుండి కమ్మవారిచెరువు వరకు డబుల్ లైన్ రోడ్డు నిర్మాణం రూ.10.05 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల దశలో ఉందని తెలిపారు. చంద్రన్న రహదారి పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 65 సిసి రోడ్లను అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలన్నారు. ముఖ్యమంత్రి ముందుచూపుతో చెరువుల తవ్వకాలు, పంట కుంటలు, ఇంకుడు గుంటల ఏర్పాటు వల్ల 10 అడుగులు మేర భూగర్భ జలాలు పెరిగాయన్నారు. బందరు నియోజకవర్గ అభివృద్ధే తన ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర నాయకులు కొనకళ్ళ జగన్నాథరావు, జెడ్పీటిసి లంకే నారాయణప్రసాద్, మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఊసా వెంకట సుబ్బారావు, మార్కెట్ యార్డు ఛైర్మన్ గోపు సత్యనారాయణ, ఎంపిటిసి నాగమల్లేశ్వరరావు, మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, టిడిపి మండల అధ్యక్షులు తలారి సోమశేఖర్, తదితరులు పాల్గొన్నారు.