కృష్ణ

ఉపాధ్యాయుల చేతిలోనే విద్యార్థుల భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, సెప్టెంబర్ 29: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలోనే ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎ సుబ్బారెడ్డి సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ హైస్కూలులో గురువారం మండల విద్యా సమావేశాన్ని ‘మేలుకొలుపు’ పేరుతో ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మండల విద్యా సమీక్ష కార్యక్రమాన్ని తోట్లవల్లూరు నుంచి మొదలు పెడుతున్నామని తెలిపారు. సమావేశంలో 40 పాఠశాలల ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల హాజరు, వసతుల లేమి, మధ్యాహ్న భోజనం, తదితర అంశాలపై సమగ్రంగా విచారించారు. చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగకపోవటం దురదృష్టకరమన్నారు. ఒక పాఠశాలలో 25 మంది విద్యార్థులుంటే నెలకు రూ.6.25 లక్షల జీతాలను ప్రభుత్వం చెల్లిస్తోందని ఉదహరించారు. అంటే ఉపాధ్యాయులకు ఇచ్చే జీతాలు ఎంతగా ఉన్నాయో అర్థం చేసుకోవాలన్నారు. అందువల్ల ఉపాధ్యాయులకు అంకిత భావం అవసరమని చెప్పారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్య అలవాట్లు నేర్పాలని, లేకుంటే చెడు సమాజం ఏర్పడుతుందన్నారు. ముందుగా ఉపాధ్యాయులకు క్రమశిక్షణ అవసరమని, పాఠశాలకు సమయానికి రావటం, చక్కటి విద్యాబోధన చేయటం అవసరమన్నారు. మధ్యాహ్న భోజనం చక్కటి వాతావరణంలో పెట్టాలని, లేకుంటే విద్యార్థులు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం వుంటుందన్నారు. ప్రపంచంలో ఉత్తమమైనది ఉపాధ్యాయ వృత్తి ఒక్కటేనని, ఆ గౌరవం మరెవరికి లభించదనీ, దాన్ని కాపాడుకోవాలని సుబ్బారెడ్డి సూచించారు.
డిఇవో దృష్టికి సమస్యలు
ఎంపిపి కళ్ళం వెంకటేశ్వరరెడ్డి, జెడ్పీటిసి సభ్యురాలు తాతినేని పద్మావతి మాట్లాడుతూ మండలంలోని పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను డిఇవో సుబ్బారెడ్డికి వివరించారు. వంటషెడ్లు అసంపూర్తిగా ఉన్నాయని, పెనమకూరు దక్షిణ దళితవాడ పాఠశాలలో 54 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడే ఉన్నారని, అందువల్ల ఉపాధ్యాయుల సంఖ్య పెంచాలని, రొయ్యూరులో పాఠశాల నిర్మాణం బిల్లులు రాక కాంట్రాక్టర్ మధ్యలోనే ఆపివేశాడని వివరించారు. ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిఇవోను వారు కోరారు. సమావేశంలో ఎంఇఓ కృష్ణదిలీప్, జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎంలు ధనలక్ష్మి, వై శ్రీనివాస్, నాగభూషణం పాల్గొన్నారు.