కృష్ణ

ల్యాండ్ పూలింగ్‌కు చట్టబద్ధత లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 7: చట్టబద్ధత లేని ల్యాండ్ పూలింగ్ ద్వారా టిడిపి ప్రభుత్వం రైతుల భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి టి లక్ష్మణరెడ్డి విమర్శించారు. భూహక్కుల పరిరక్షణ కమిటి, పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక యుటిఎఫ్ భవన్‌లో 2013 భూసేకరణ చట్టం, భూసమీకరణ అంశంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయాలేతప్ప కీడు చేయకూడదన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చట్టబద్ధత లేని ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అవలంభిస్తుందన్నారు. మూడు పంటలు పండే పచ్చని పొలాలను పారిశ్రామిక వేత్తలకు కట్టబెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్బన్ డెవలెప్‌మెంట్ అధారిటీ 2016 రూల్స్‌లో ల్యాండ్ పూలింగ్ అంశాన్ని చేర్చారేతప్ప శాసనసభలో చట్ట భద్రత కల్పించలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతుల అనుమతి లేకుండా ఎటువంటి నోటిఫికేషన్‌లు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. గతంలో ఇచ్చిన భూసేకరణ, ప్రస్తుత భూ సమీకరణ నోటీసుల పట్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రైతులు న్యాయ స్థానాలను ఆశ్రయించకపోవడం వల్లనే ప్రభుత్వం ఇటువంటి విధానాలకు పాల్పడుతోందన్నారు. 80శాతం మంది రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధపడితేనే 2013 భూసేకరణ చట్టాన్ని ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. లేని పక్షంలో రైతులు నుండి సెంటు భూమి కూడా తీసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉండదన్నారు. ఒక వేళ భూములను స్వాధీనం చేసుకున్న సంస్థ గానీ, ప్రభుత్వం గానీ వాటిని విక్రయిస్తే లాభంలో సంగం రైతుకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి టి సురేష్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వాలు చట్టాలను వక్రీకరిస్తున్నాయని విమర్శించారు. విపక్షంలో ఉన్నపుడు పోర్టుకు 2వేల ఎకరాలు సరిపోతాయని చెప్పిన టిడిపి నేడు దొడ్డి దారిన వేలాది ఎకరాలు సేకరించాలని చూస్తుందన్నారు. ఈ సమావేశంలో వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని), భూ పరిరక్షణ పోరాట సమితి కన్వీనర్ కొడాలి శర్మ, సిపిఐ నాయకులు ఎం రామారావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ మతీన్, సిపిఎం నాయకులు చౌటపల్లి రవి, బూర సుబ్రహ్మణ్యం, కొల్లాటి శ్రీనివాస్ పాల్గొన్నారు.