కృష్ణ

అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నాం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 7: బందరు ఓడరేవు, అనుబంధ పరిశ్రమల స్థాపనలో రాజకీయ స్వార్ధం గానీ, వ్యక్తిగత స్వార్ధం లేదని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ డెప్యూటీ కలెక్టర్లు, విఆర్‌ఓలు, విఆర్‌ఎలకు ల్యాండ్ పూలింగ్ విధానంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ బందరు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన బందరు అభివృద్ధిని గత పాలకులు నిర్వీర్యం చేశారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బందరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో భాగంగానే ప్రజలు చిరకాలవాంఛ పోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఒక్క పోర్టుతో అభివృద్ధి జరగదని, దానికి అనుబంధంగా పరిశ్రమలు వస్తేనే అన్ని రంగాలలో ఈ ప్రాంతం అభివృద్ధిచెందుతుందన్నారు. ఈ మేరకు అవసరమైన భూముల సమీకరణకు నోటిఫికేషన్ ఇచ్చామని, దీన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు రైతుల్లో లేనిపోని అపోహలు సృష్టించి అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బందరు అభివృద్ధిలో భాగస్వాములం కావటం మన అందరి అదృష్టమన్నారు. పోర్టు నిర్వహణ బాధ్యతను నవయుగకు 30 సంవత్సరాలు మాత్రమే లీజుకు ఇవ్వటం జరిగిందన్నారు. ఆ తరువాత పోర్టు నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చూస్తుందన్నారు. పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్‌లో అధికారులు ముఖ్య పాత్ర పోషించాలన్నారు. అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో అధికారులు అద్వితీయమైన పాత్ర పోషించారన్నారు. అటువంటి పాత్రనే బందరులో అధికారులు పోషించాల్సి ఉందన్నారు. పోర్టు, పరిశ్రమలకు భూములు ఇచ్చే రైతులకు అమరావతి ప్యాకేజిని మించిన ప్యాకేజిని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈ ప్యాకేజి వల్ల కలిగే లాభాలను రైతులకు క్షుణ్ణంగా వివరించాలని అధికారులకు సూచించారు. నోటిఫికేషన్‌లో గ్రామ కంఠాలు, నివేశన స్థలాలు ఉన్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రైతుల ఇష్ట ప్రకారమే భూములను పూలింగ్‌లో తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ సాయిబాబు, మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, మున్సిపల్ ఛైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, టిడిపి రాష్ట్ర నాయకులు కొనకళ్ళ జగన్నాధరావు(బుల్లయ్య), గొర్రెపాటి గోపిచంద్, బూరగడ్డ రమేష్ నాయుడు, తహశీల్దార్ నారదముని తదితరులు పాల్గొన్నారు.