కరీంనగర్

బస్టాండ్‌ను పరిశీలించిన ఆర్టీసీ ఆర్‌ఎం, ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి, అక్టోబర్ 7: దసరా నుండి పెద్దపల్లి జిల్లాగా ఆవిర్భవిస్తున్న తరుణంలో పెద్దపల్లి బస్టాండులో ప్రజల సౌకర్యార్థం పెద్దపల్లిలో రాత్రివేళలో బస్సులను నిలుపాలని శుక్రవారం ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆర్టీసి ఆర్‌ఎం చంద్రశేఖర్‌ను కోరారు. పెద్దపల్లి బస్టాండును ఆర్టీసి రీజనల్ మేనేజర్‌ను కలిసి ఎమ్మెల్యే కలియతిరిగారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పెద్దపల్లి నుండి గ్రామీణ ప్రాంత ప్రజలు రాత్రివేళలో ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు బస్టాండులో మినిమమ్ పది బస్సులను నిలిపవేయాలని ఎమ్మెల్యే కోరారు. దీనికి ఆర్టీసి ఆర్‌ఎం సానుకూలంగా స్పందించి బస్సులను బస్టాండులో నిలుపుతానని హామీ ఇచ్చారు. వారి వెంట ఆర్టీసి మేనేజర్లు ఆనంద్, మల్లేశం, టిఆర్‌ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తానిపర్తి తిరుపతి రావు, నాయకులు కృష్ణమూర్తి, మల్లిఖార్జున్, ఆంజనేయ రావు, శ్రీనివాస్, సాయిరాం, దిలీప్‌ పాల్గొన్నారు.