కృష్ణ

పోర్టు నిర్మాణానికి సైనికుల్లా పని చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 9: బందరు పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణంతో బందరు కలలు సాగారం చేసేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం స్థానిక పోలీస్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ రైతులు, ప్రజలకు పోర్టు నిర్మాణం కొరకు సేకరించే భూసమీకరణపై జరిగిన సదస్సులో మంత్రి ముఖ్య అతిథిగా ప్రసంగించారు. బందరు పోర్టు నిర్మాణం ఒక మహా ఉద్యమంలా సాగాలన్నారు. ఈ అరుదైన అవకాశాన్ని మన ప్రాంత వాసులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. రైతులకు లబ్ధిచేకూర్చే విధంగా ల్యాండ్ పూలింగ్ విధానం ఉంటుందన్నారు. భూములిచ్చే రైతులకు వరల్డు క్లాస్ లెవెల్ షిప్‌ను ఏర్పాటు చేసి అందులో వారిని భాగస్వాములను చేయడం జరుగుతుందని తెలిపారు. పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ ప్రజలకు తెలిసే విధంగా నాయకులు ఆహర్నిశలు శ్రమించాలన్నారు. మన భూములు రాజధాని భూములతో సమానంగా విలువ పెరిగాయన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో రాబోయే రోజుల్లో బందరు పోర్టు కీలకపాత్ర పోషిస్తుందని, పోర్టు నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటుతో ఈ ప్రాంతం ఇతర ప్రాంతాలకంటే శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తాడికొండ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ రాజధాని భూసమీకరణలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ప్రజలకు, రైతులకు మేలైన ప్యాకేజిని అందించేందుకు రెండు సంవత్సరాలు శ్రమించవలసి వచ్చిందన్నారు. అదే ప్యాకేజిని వారికి అందించడం శుభపరిణామం అన్నారు. ఇండియాలోనే చారిత్రక పట్టణం అయిన బందరు పోర్టు నిర్మాణంతో దశ తిరగడానికి మార్గం ఏర్పడిందన్నారు. ఈ సమావేశంలో రాజధాని ప్రాంత రైతులు బెల్లంకొండ నరసింహారావు, తుళ్లూరు ఎంపిపి వడ్లమూడి పద్మలత, వైస్ ఎంపిపి పోతురాజు, దనేకుల రామారావు, మయినేని గిరిజ, అనుమోలు సత్యనారాయణ, గడ్డం మార్టిన్ లూదర్ బాబు, రాష్ట్ర బిసి నాయకులు కొనకళ్ళ జగన్నాధరావు(బుల్లయ్య), జెడ్పీటిసి లంకే నారాయణ ప్రసాద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు ఛైర్మన్ గోపు సత్యన్నారాయణ, మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, పార్టీ జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ బూరగడ్డ రమేష్ నాయుడు, మాజీ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గొర్రెపాటి గోపిచంద్, వారిశెట్టి తిరుమలరావు, రైతులు పాల్గొన్నారు.