కృష్ణ

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విస్సన్నపేట, అక్టోబర్ 15: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళిత, గిరిజనల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని వృద్ధిలోకి రావాలని ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. స్థానిక వికాస్ కళాశాల ప్రాంగణంలో శనివారం దళిత, గిరిజనుల అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన శివాజీ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన లేకపోవటంతో వాటి ద్వారా లబ్ధి పొందే అవకాశాన్ని దళిత, గిరిజనులు కోల్పోతున్నారని, బ్యాంకులు కూడా దళిత, గిరిజనుల అభివృద్ధికి రుణ సౌకర్యం కల్పించటంలేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు దళిత, గిరిజనులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి వాటి ద్వారా లబ్ధిపొందేందుకు కృషి చేయాలని అన్నారు. టిడిపి ప్రభుత్వం ఎస్‌సి, ఎస్‌టి సంక్షేమానికి ఏటేటా నిధులు కేటాయిస్తున్నప్పటికీ వాటిని వినియోగించుకోకపోవటంతో మురిగిపోతున్నాయని అన్నారు. కిషోర్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లగడ్ల స్వామిదాస్, జెడ్పీటిసి మట్టా ధనలక్ష్మి, తెలుగు మహిళా జిల్లా నాయకురాలు నాదెండ్ల నాగమణి పలువురు దళిత, గిరిజనల నాయకులు పాల్గొన్నారు. ఈసందర్భంగా నిర్వాహకులు శివాజీని ఘనంగా సత్కరించారు.