కృష్ణ

పచ్చ కండువా కప్పుకోనున్న వేదవ్యాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 16: రాష్ట్ర అంచనాల కమిటీ మాజీ ఛైర్మన్, మాజీ ఉప సభాపతి బూరగడ్డ వేదవ్యాస్ అధికార తెలుగుదేశం పార్టీ చెంతకు చేరనున్నారు. ఈ నెల 21న సాయంత్రం 4గంటలకు ఆయన విజయవాడలో టిడిపిలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వేదవాస్ పచ్చకండువాను కప్పుకోనున్నారు. ఆయనతో పాటు వేలాది మంది అభిమానులు టిడిపిలో చేరనున్నారు. ఇందుకు సంబంధించి పెడన నియోజకవర్గంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన వేదవ్యాస్ ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబును విజయవాడలో కలిసి పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. ఇందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించి వేదవ్యాస్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుండి వచ్చిన వేదవ్యాస్ చేరిక టిడిపికి అదనపు బలంగా మారనుందని ఆయన వర్గీయులు అంటున్నారు. మంగళవారం ఆయన పెడన నియోజకవర్గానికి రానున్నారు. నాలుగు మండలాల నుంచి పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలను సమీకరించి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆయన మద్దతుదారులు గ్రామాల్లో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి గ్రామం నుండి వేదవ్యాస్‌కు మద్దతుగా భారీగా తరలి వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. మూడుసార్లు ఎఐసిసి సభ్యునిగా, ఎస్‌ఎస్‌సి డైరెక్టర్‌గా, అంచనాల కమిటీ ఛైర్మన్‌గా, ఉప సభాపతిగా అనేక పదవులు నిర్వహించిన వేదవ్యాస్ వైకాపాలో చేరినా ఇమడలేకపోయారు. ముఖ్యంగా పార్టీలో అనేక అవమానాలు ఎదుర్కోవటమే కాకుండా రానున్న ఎన్నికల్లో టిక్కెట్టు కూడా సందేహంగా మారింది. ఈ క్రమంలో ఆయన టిడిపిలో చేరిక అనివార్యంగా మారింది. వేదవ్యాస్ తనయుడు కిషన్‌తేజ్‌కు, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మధ్య ఉన్న స్నేహం కారణంగా వ్యాస్ టిడిపి గూటికి చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక పదవులను సమర్ధవంతంగా నిర్వహించిన వేదవ్యాస్‌కు మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ) ఛైర్మన్ పదవిని ఇస్తారనే ప్రచారం సాగుతోంది. పెడనతో పాటు బందరు నియోజకవర్గంపై కూడా వేదవ్యాస్‌కు మంచి పట్టు ఉంది. ఈనేపథ్యంలో మడ ఛైర్మన్ పదవి ఆయనకు ఇస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది. 2014 సాధారణ ఎన్నికల్లో అవనిగడ్డ నియోజకవర్గం నుండి టిడిపి టిక్కెట్టుపై పోటీ చేసి విజయం సాధించిన కరుడుకట్టిన కాంగ్రెస్‌వాది మండలి బుద్ధప్రసాద్‌కు చంద్రబాబు సముచిత స్థానం కల్పించారు. శాసనసభ ఉప సభాపతిగా నియమించారు. అదేవిధంగా వేదవ్యాస్‌కు కూడా టిడిపిలో సముచిత స్థానం కల్పించనున్నట్లు సమాచారం. ఇదిలావుండగా వేదవ్యాస్ చేరిక పట్ల ఆయన రాజకీయ ప్రత్యర్థి, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు వర్గం వౌనంగా వ్యవహరిస్తోంది. గత 25 సంవత్సరాలుగా పెడన నియోజకవర్గంలో కాగిత వెంకట్రావు, వేదవ్యాస్ రాజకీయంగా నువ్వా.. నేనా? అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఈక్రమంలో టిడిపిలో చేరుతున్న వేదవ్యాస్, కాగిత మధ్య సమన్వయం ఎలా ఉంటుందోనని నియోజకవర్గ ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మూడు విద్యుత్ మోటార్ల చోరీ
కూచిపూడి, అక్టోబర్ 16: ఒక్కరాత్రే మూడు విద్యుత్ మోటార్లు చోరీకి గురవటంతో పెదపూడి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మొవ్వ మండలం పెదపూడి గ్రామానికి చెందిన మొవ్వ శ్రీనివాసరావు, మొవ్వ మాధవరావు, కాసాని అప్పయ్యలకు చెందిన వ్యవసాయ భూముల్లో విద్యుత్ మోటార్లు శనివారం తెల్లవారుఝామున చోరీకి గురయ్యాయి. దీంతో మండలంలోని ఇతర రైతులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు 15 ఎకరాల మెట్ట భూముల్లో విద్యుత్ మోటార్లతో పసుపు, మొక్కజొన్న సాగు చేసుకుంటున్న ఆకుల చిన వెంకటేశ్వరరావు, నాగరాజు, చేబ్రోలు వెంకటేశ్వరరావు అనే కౌలు రైతులు వర్షాలు తగ్గుముఖం పట్టి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో మోటార్లు వినియోగిస్తున్నారు. ఈనేపథ్యంలో విద్యుత్ మోటార్లు చోరీకి గురికావటంతో రైతులకు ఏమి సమాధానం చెప్పాలో తెలియక, చేతుల్లో డబ్బులు లేక కొత్త మోటార్లు కొనలేక, పంటను ఎలా రక్షించుకోవాలో తెలియక సతమతవౌతున్నారు.