రాష్ట్రీయం

కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 23: కృష్ణా పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని మంత్రులు తెలిపారు. గోదావరి పు ష్కరాలను విజయవంతంగా నిర్వహించిన తరహాలో కృష్ణా పుష్కరాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. కృష్ణా పుష్కరాల నిర్వాహణపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆయా శాఖ ల అధికారులతో సోమవారం సచివాలయంలో సమీక్ష జరిపారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో కృష్ణా పుష్కరాలు నిర్వహిస్తామని, ఆయా జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై రెండు జిల్లాల నుంచి నివేదిక అందిన తరువాత ముఖ్యమంత్రితో సమావేశం కానున్నట్టు మంత్రులు తెలిపారు. గతంలో ఏర్పాటు చేసిన ఘాట్ల కన్నా ఎక్కువ ఘాట్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అదే విధంగా రోడ్లను నిర్మించనున్నట్టు చెప్పారు. గత పుష్కరాలకు నల్లగొండ జిల్లాలో 16 ఘాట్లు ఉంటే పాత వాటితో పాటు అదనంగా మరో 18 ఘాట్లు నిర్మించనున్నట్టు చెప్పా రు. త్వరలోనే వివిధ శాఖలతో పూర్తి నివేదకను తెప్పించుకుని అవసరం అయిన ఏర్పాట్లు చేయనున్నట్టు మంత్రులు తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో కృష్ణా పుష్కరాలకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్టు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, దేవాదాయ శాఖ అధికారులు ప పాల్గొన్నారు.