కృష్ణ

అక్రమ సంబంధం నేపథ్యంలో వివాహిత, యువకుడు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందిగామ/పెనుగంచిప్రోలు, నవంబర్ 30: అక్రమ సంబంధం నేపథ్యంలో ఒక యువకుడు, వివాహిత ఆత్మహత్యకు చేసుకున్నారు. ఈ సంఘటన జాతీయ రహదారిపై ముండ్లపాడు సమీపంలో సోమవారం జరిగింది. కంచికచర్ల మండలం మొగులూరుకు చెందిన బోయిన సుజాత (26)కు జగ్గయ్యపేట మండలం పోచంపల్లికి చెందిన నాగేశ్వరరావుతో సుమారు 9 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 8, 6 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా వారి ఇంటి సమీపంలో నివాసం ఉండే అరికట్ల నాగవేణు (25) అనే అవివాహిత యువకుడితో సుజాతకు అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయిన వీరిద్దరు సోమవారం ముండ్లపాడు అడ్డరోడ్డు వద్ద పురుగు మందు తాగారు. పురుగు మందు తాగిన సుజాత అక్కడికక్కడే మృతి చెందగా నాగవేణు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పెనుగంచిప్రోలు ఎస్‌ఐ కె సతీష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వౌన మునిగా వీరపాండియన్..!
విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 30: పక్కాగృహాలు ఇప్పిస్తామంటూ సుమారు 120 మంది వద్ద నుంచి కోటి 80 లక్షలు వసూలు చేసిన యుసిడి ఉద్యోగి, నగరంలో నానాటికీ పెరుగుతున్న అక్రమ నిర్మాణాలు, నిర్మాణాలపై టౌన్‌ప్లానింగ్ అధికారులపై అవినీతి విమర్శలు... ఇలా చెప్పుకొంటూ పోతే విఎంసి కార్యకలాపాల్లో జరుగుతున్న పలు అవినీతి అక్రమాలపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నా విఎంసి కమిషనర్ వీరపాండియన్ పెదవి విప్పడం లేదన్న విషయం ప్రస్తుతం విఎంసి కార్యాలయంలో హాట్ టాపిక్‌గా మారింది. పక్కాగృహాల పేరుతో అక్రమంగా వసూలు చేసిన ఉదంతంపై మీడియాలో వచ్చిన వార్తాకథనాలకు పాలక, విపక్షాలు సైతం స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ వచ్చినా అసల