కృష్ణ

జిల్లాలో చేనేత రుణమాఫీకి రంగం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, నవంబర్ 30: జిల్లాలో చేనేత రుణాల మాఫీకి రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.110కోట్లు మేర చేనేత రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో మన కృష్ణాజిల్లాకు సంబంధించి రూ.2.5కోట్ల మేర రుణాలు మాఫీ కానున్నాయి. 1202 మంది కార్మికులు రుణ విముక్తులు కానున్నారు. 2014 మార్చి 31ని కటాఫ్ డేట్‌గా నిర్ణయించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ప్రధానమైన హామీలలో చేనేత రుణ మాఫీ ఒకటి. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణాలు, డ్వాక్రా రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం చేనేత రుణాలను మాఫీ చేయడంలో కొంత సమయం తీసుకుంది. దీంతో చేనేత కార్మికుల్లో ఆందోళన నెలకొంది. రుణాలు ఎప్పుడు మాఫీ చేస్తారా..? అని ఎదురు చూశారు. ఆ సమయం రానే వచ్చింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో చేనేత రుణాలు మాఫీ చేయాలని తీర్మానం చేశారు. గతంలో ఆర్‌ఆర్‌ఆర్ పథకం కింద తీసుకున్న చేనేత రుణాలను ప్రభుత్వం మాఫీ చేయగాచేనేత ప్రస్తుతం క్రెడిట్ కార్డు ద్వారా వివిధ జాతీయ బ్యాంక్‌లలో కార్మికులు తీసుకున్న రుణాలను మాఫీ చేయనున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ పథకం కింద జిల్లాలో రూ.91.97లక్షలు మేర రుణాలు మాఫీ కాగా 336 మంది కార్మికులు లబ్ధి పొందారు. ప్రస్తుతం చేనేత క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు తీసుకున్న లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్, రేషన్ కార్డు అనుసంధాన ప్రక్రియను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. జిల్లాలో చేనేత రంగంలో అనేక అటుపోట్లు ఎదుర్కొంటోంది. కష్టాల సుడిగుండంలో కార్మికులు కొట్టుమిట్టాడుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక, కొత్తగా అప్పులు పుట్టక సతమతమవుతున్నారు. కొన్ని వేల కుటుంబాలు పస్తులతో అలమటిస్తున్నాయి. ఈ క్రమంలో రుణమాఫీ కొంత ఊరటనివ్వనుంది. రుణమాఫీ కోసం గత కొంత కాలంగా కార్మిక సంఘాలు అనేక ఉద్యమాలు చేశాయి. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఎట్టకేలకు రద్దుకు నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో పెడన, మచిలీపట్నం, చల్లపల్లి, కప్పలదొడ్డి ప్రాంతాల్లో చేనేత పరిశ్రమ ఉంది. సుమారు 7వేల మగ్గాల ద్వారా 15 వేల మంది కార్మికులు చేనేతను నమ్ముకుని ఆధారపడి జీవిస్తున్నారు.

గన్నవరంలో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు
గన్నవరం, నవంబర్ 30: గన్నవరం వీఎస్ సెయింట్ జాన్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో డిసెంబర్ 9 నుండి 13వ తేదీ వరకు సిబిఎస్‌ఇ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ బ్రదర్ బాలశౌరి తెలిపారు. సోమవారం ఉదయం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో భారతదేశం నుంచే గాక కువైట్, బహ్రెయిన్, ఒమన్, ఖతార్, యుఏఇ, సౌదీ అరేబియా దేశాలకు చెందిన 64 బాల, బాలికల జట్లు పాల్గొంటాయని ఆయన తెలిపారు. దేశ విదేశాలకు చెందిన 800 మంది క్రీడాకారులు హాజరవుతారన్నారు. 16 క్లస్టర్స్‌లో గెలుపొందిన బాల, బాలికల విన్నర్స్, రన్నర్స్ టీములు ఈ పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఈ పోటీలను మాంట్‌ఫోర్డ్ బ్రదర్స్ ఆఫ్ సెయింట్ గాబ్రియేల్ ఎడ్యుకేషన్ సొసైటీ సౌజన్యంతో ప్రతిష్టాత్మకంగా గన్నవరంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబర్ 9వ తేదీ ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ క్రీడల శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు హాజరయ్యే క్రీడాకారులకు అన్ని రకాల భోజన, వసతి సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గల్ఫ్ క్రీడాకారులకు విజయవాడ కె హోటల్, ఇన్నోటల్‌లో వసతి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చే క్రీడాకారులను గన్నవరం ఎయిర్‌పోర్టు, విజయవాడ రైల్వేస్టేషన్‌లో కౌంటర్స్ ఏర్పాటు చేసి వారిని సొంత బస్సుల్లో క్రీడా ప్రాంగణానికి తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు బాలశౌరి వివరించారు. ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమణారావు పర్యవేక్షణలో, అంతర్జాతీయ రిఫరీ డానియేల్ ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయన్నారు. ఈ సమావేశంలో బ్రదర్ జేసురాజ్, రాంబాబు, విజయ్ పాల్గొన్నారు.