కృష్ణ

వైభవంగా తిరుపతమ్మ రంగుల మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుగంచిప్రోలు, జనవరి 31: అమ్మ శరణం.. తిరుపతమ్మ శరణం.. అనే నామ సంకీర్తనలతో పెనుగంచిప్రోలు గ్రామం ఆదివారం మారుమోగింది. రెండు రోజులకు ఒక సారి జరిగే తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవానికి ఆదివారం తిరుపతమ్మ అమ్మవారితో పాటు సహదేవతలు కూడా జగ్గయ్యపేట పయనమయ్యారు. ముందుగా ఆలయంలో తిరుపతమ్మ అమ్మవారికి, గోపయ్య స్వామివారికి, సహదేవతలకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం రఘునాథ్, చైర్మన్ వాసిరెడ్డి బెనర్జీ, ప్రధాన అర్చకులు మర్రెబోయిన వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహాలను బయటకు తీసుకొచ్చి అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం రజకులు విగ్రహాలను శిరస్సుపై ధరించి ఊరేగింపుగా గ్రామంలోని రంగుల మండపం వద్దకు చేర్చారు. ఈసందర్భంగా ఉదయం 6గంటలకు ప్రారంభమైన ఊరేగింపు రంగుల మండపం వద్దకు చేరుకునేసరికి సాయంత్రం 4గంటల సమయం పట్టింది. ఊరేగింపు సందర్భంగా అడుగడుగునా మహిళలు అమ్మవారి విగ్రహాల ముందు వార్లు పోస్తూ కొబ్బరికాయలు కొడుతూ మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఊరేగింపులో నిర్వహించిన చిన్న పిల్లల కోలాటం, మరియు కల్యాణ వెంకటేశ్వర స్వామి భక్తబృందం గొడుగుల కోలాటంతో పాటు విచిత్ర వేషధారణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. గ్రామానికి చెందిన డప్పు, సన్నాయి మేళం కూడా ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముందుగా అమ్మవారు ఊరేగింపు నిర్వహించే రోడ్డుమార్గం మొత్తం పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శుభ్రం చేశారు. దుమ్ము, మట్టి లేవకుండా వాటరింగ్ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నందిగామ ఇన్స్‌పెక్టర్ సత్యనారాయణ పర్యవేక్షణలో ఎస్‌ఐ కె సతీష్ సిబ్బంది విగ్రహాల చుట్టూ రోప్‌వేతో బందోబస్తు నిర్వహించారు. గ్రామపెద్దలు చింతల సీతారామయ్య, కాకాని శ్రీనివాసరావు, కర్ల వెంకట నారాయణ, నల్లపునేని వెంకట నారాయణ, ఊట్ల నాగేశ్వరరావు, బిక్కి నర్శింహరావు, గింజుపల్లి నర్సయ్య, ఇఇ వైకుంఠరావు, ఎఇఒలు మేడా గోపాలరావు, చల్లా రామకృష్ణ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఎడ్లబండ్లపై జగ్గయ్యపేటకు విగ్రహాలు
స్థానిక శ్రీగోపయ్య సమేత శ్రీతిరుపతమ్మ అమ్మవారు, సహదేవతలు ఆదివారం రాత్రి ఎడ్లబండ్లపై జగ్గయ్యపేట పయనమయ్యారు. వారంరోజుల క్రితం లాటరీ పద్ధతి ద్వారా ఎంపికైన రైతులు తమ ఎడ్లబండ్లకు ప్రత్యేక పూల అలంకరణలతో పాటు విద్యుత్ దీపాలంకరణ చేసి సౌండ్ సిస్టంతో యువకులు ఊరేగింపుగా రంగుల మండపం వద్దకు చేర్చారు. అనంతరం అమ్మవారికి ఆచారంగా వస్తున్న కుమ్మర్లు, రజకులు అమ్మవారికి కుంభం వండి నైవేద్యం పెట్టారు. అనంతరం 11 ఎడ్లబండ్లలో విగ్రహాలను ఉంచి దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక జనరేటర్ సహాయంతో విద్యుత్ దీపాలంకరణతో జగ్గయ్యపేట తరలివెళ్లారు. పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఖరీఫ్ నష్టాలు పూడేనా?
* అపరాల కౌలురైతుల్లో కోటి ఆశలు
* 20రోజుల్లో మినుము, పెసర కోతలకు సిద్ధం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), జనవరి 31: ఖరీఫ్ నష్టాలను అపరాల దిగుబడులు భర్తీ చేస్తాయని రైతులు ఆశిస్తున్నారు. ఖరీఫ్‌లో అష్టకష్టాలు పడి సాగుచేసినా చివరకు అప్పులే మిగిలాయి. దీంతో అపరాల దిగుబడులపై అన్నదాతలు కోటి ఆశలు పెట్టుకుని సాగు చేపట్టారు. జిల్లాలో ముందుగా విత్తిన మినుము, పెసర పైర్లు 20రోజుల్లో కోతలకు సిద్ధం కానున్నాయి. ఎకరాకు 4 నుండి 15 బస్తాల వరకు దిగుబడులు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. ముఖ్యంగా మినుము, పెసర ధరలను దృష్టిలో పెట్టుకుని సాగు చేపట్టారు. పురుగులు, తెగుళ్లను అధిగమించి పైర్లు కోతలకు సిద్ధమయ్యాయి. ఎకరాకు 30నుండి 40వేల వరకు పెట్టుబడి పెట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అపరాల సాగుకు భారీగా పెట్టుబడి పెట్టారు. సుమారు ఎకరాకు 10సార్లు పురుగు మందులు పిచికారీ చేశారు. అయితే ధరలు నిలకడగా ఉంటే అపరాలు రైతులకు సిరులు కురిపిస్తాయనడంలో సందేహం లేదు. విత్తనాల కోసం 100 కిలోలు 15వేలు నుండి రూ.18వేల వరకు కొనుగోలు చేశామని, అదేవిధంగా ధర లేకపోయినా రూ.10వేలు ఉంటే అప్పుల ఊబి నుంచి గట్టెక్కుతామని రైతులు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ధర రూ.9వేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ధర మాత్రం నిలకడగా ఉంటే అపరాల రైతులు అప్పుల ఊబి నుంచి గట్టెక్కుతారనడంలో సందేహం లేదు.
కౌలురైతులకు అపరాలే దిక్కు
ముఖ్యంగా కౌలురైతులకు మాత్రం అపరాలే దిక్కుకానున్నాయి. ఎకరాకు 15నుండి 24బస్తాల వరకు కౌలుకు సాగు చేశారు. అయితే ఖరీఫ్‌లో సాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చటంతో ఖర్చులు తడిసిమోపెడయ్యాయి. ఎకరాకు కేవలం 30బస్తాల దిగుబడి మాత్రమే రావటంతో అపరాల దిగుబడులపైనే కౌలురైతులు కోటి ఆశలు పెట్టుకున్నారు. కౌలు మాట్లాడుకున్న విధంగానే రైతులకు కౌలు చెల్లించాల్సి ఉంది. ఎకరాకు 30బస్తాలు దిగుబడి రాగా వాటిలో 23బస్తాలు కౌలుకుపోతే కౌలుదారుడికి కేవలం ఏడు బస్తాలు మాత్రమే ఉన్నాయి. ఖర్చులు మాత్రం ఎకరాకు రూ.25వేల నుండి రూ.30వేల వరకు అయ్యాయి. అంటే ఖరీఫ్ సాగుచేసిన కౌలురైతుకు రూ.15వేల నుండి రూ.20వేలకు పైగా అప్పులు పడ్డారు. ఈ అప్పులను అపరాల దిగుబడులు భర్తీ చేస్తాయని కొండంత ఆశతో వారు ఎదురుచూస్తున్నారు.

కృష్ణా నదిలో మునిగి విద్యార్థి మృతి

చందర్లపాడు, జనవరి 31: కృష్ణా నదిలో ఈత సరదా నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ సంఘటన మండలంలోని కొడవటికల్లులో ఆదివారం జరిగింది. గుదె నరసింహారావు, లక్ష్మి కుమారుడు శ్రీరామ్(15) స్నేహితులతో కలిసి పక్కనే ఉన్న కృష్ణా నదిలో మధ్యాహ్న సమయంలో ఈత కొట్టటానికి వెళ్లాడు. నదిలోకి దిగినచోట లోతుగా ఉండటంతో మునిగిపోయాడు. మిగిలిన వారు వెంటనే గ్రామానికి చేరుకుని గ్రామస్థులకు తెలిపారు. దీంతో గ్రామస్థులు నది దగ్గరకు వెళ్లి గాలించగా పడిన చోటే శ్రీకాంత్ మృతదేహం లభ్యం అయింది. శ్రీరామ్ చందర్లపాడు నాగార్జున పబ్లిక్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావటంతో ఇంటి దగ్గరకు వెళ్లాడు. నరసింహారావుకు ఇద్దరు మగ పిల్లలు. పెద్దవాడు శ్రీరామ్, చిన్నవాడు శ్రీనివాస్(10) 6వ తరగతి నారాయణ విద్యాసంస్ధలో చదువుతున్నాడు. విషయం తెలిసిన వెంటనే తహశీల్దార్ భిక్షారావు, ఎస్సై దుర్గాప్రసాద్, ఆర్‌ఐ వెంకటాచలం సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. శ్రీరామ్ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. శ్రీరామ్ మరణ వార్తతో కుటుంబం శోకసంద్రమైంది.

దేశానికి దిశా నిర్దేశకులు యువతే..
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, జనవరి 31: యువత సన్మార్గం వైపు పయనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ డిజిపి కె అరవిందరావు అన్నారు. హిందూ కళాశాల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన యువకెరటాలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఈసందర్భంగా అరవిందరావు మాట్లాడుతూ దేశానికి దిశా నిర్దేశకులు యువకులేనన్నారు. యువత సరైన మార్గంలో పయనిస్తేనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. మన దేశానికి గొప్ప సంపద యువతేనన్నారు. కర్తవ్య దీక్షతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. పుస్తక పఠనంతో పరిజ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. సామాజిక స్పృహతో దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. ప్రపంచ దేశాలలో ఎక్కడ ఉన్నా మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలను మరవకూడదన్నారు. భారతదేశ రాయబారిగా మాత్రమే యువత విదేశాలకు వెళ్ళాలే గాని అక్కడి పాశ్చాత్య పోకడలకు ఏమాత్రం ఆకర్షితులు కారాదన్నారు. యూరోపియన్ దేశాలు అభివృద్ధి చెందాయంటే మన దేశం వల్లేనని యువత గ్రహించాలన్నారు. కొన్ని సంవత్సరాలపాటు మన దేశంలో వ్యాపారాలు చేసి దేశ సంపదనంతా కొల్లగొట్టారన్నారు. దేశాభివృద్ధికి కులతత్వం ప్రధాన అటంకంగా మారిందన్నారు. ఓట్ బ్యాంక్ రాజకీయం పేరుతో 30 సంవత్సరాలుగా కులతత్వం పెచ్చుమీరిందని ఆవేదన వ్యక్తం చేశారు. కులతత్వం పెరగడానికి అందరూ బాధ్యులేనన్నారు. శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు అధ్యయనపరులు కావాలన్నారు. కేవలం విద్యకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించేందుకు పుస్తక పఠనం చేయాలన్నారు. స్వామి వివేకానందుని బాటలో యువత పయనించాలన్నారు. ఆటుపోట్లను అధిగమించి లక్ష్య సాధనకు పాటుపడాలన్నారు. తెలుగు వారి వారసత్వ సంపదకు రాజధాని బందరు అన్నారు. తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలను పెంచిపోషించిన గడ్డ అన్నారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బందరు అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేసేందుకే యువకెరటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘నా బందరు ఎలా ఉండాలి’ అనే అంశంపై నిర్వహించిన వ్యాస రచన, చిత్రలేఖన పోటీలలో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొని బందరు అభివృద్ధికి సూచనలు, సలహాలు అందించారన్నారు. వారి సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని బందరు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. యువతలో సృజనాత్మక శక్తిని పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడిందన్నారు. ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాథరావు, టిడిపి జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రిపాటి గోపిచంద్, మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, వైస్ చైర్మన్ కాశీవిశ్వనాథం, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, యువకెరటాలు నిర్వాహకులు ఆనంద్, ఆత్రేయ, కాంత్, కృష్ణ ప్రసాద్, దిలీప్, మనోహర్, ఎ రాజా, తదితరులు పాల్గొన్నారు.