కృష్ణ

కరవు రహిత జిల్లాగా అనంతపురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 18: అనంతపురం జిల్లాలో కరవు రహిత జిల్లాగా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డా పల్లె రఘునాథరెడ్డి అన్నారు. స్థానిక సిఎం కార్యాలయంలోని మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత మూడేళ్లలో జిల్లాలో నీటి పారుదల సౌకర్యం కల్పించేందుకు రూ. 11 వందల కోట్ల మేర ఖర్చు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రతి వర్షపు నీటి బిందువును భూగర్భంలోకి ఇంకింపచేసేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. ప్రధానంగా జిల్లాలోని చెక్‌డ్యామ్‌లు అన్నింటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడం జరిగిందన్నారు. చెరువుల గట్లు అభివృద్ధి చేయడం ఫీడర్ ఛానల్స్‌ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతోందన్నారు. హంద్రీ - నీవా ప్రాజెక్టు ద్వారా జిల్లాలోని 12 వందల 53 చెరువులకు నీటిని అందించే భగీరథ ప్రయత్నం ముఖ్యమంత్రి చేపట్టారన్నారు. భూగర్భ నీటి నిల్వలు పెంచేందుకు వర్షాభావ పరిస్థితిని ఎదుర్కొని పంటలకు రక్షణ తడులునిచ్చేందుకు జిల్లాలో 1 లక్షా, 20వేల ఫారం పాండ్స్ తవ్వడం జరుగుతోందన్నారు. ఇప్పటికీ 65వేల ఫారం పాండ్స్ తవ్వకం పురోగతిలో ఉందన్నారు. ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 5 రోజులపాటు అనంతపురం జిల్లాలో మకాం చేసి రెయిన్‌గన్స్‌ను వినియోగించి పంటపొలాలకు రక్షక తడులు ఇచ్చిన సంగతిని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులకు అనుకూలమైన ప్రభుత్వం అధికారంలో ఉందని 24వేల కోట్ల మేర రైతు రుణాలను మాఫీ చేయడం జరిగిందన్నారు. ఒక్క అనంతపురం జిల్లాలోని 8 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తూ 2వేల, 720 కోట్లు రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. కరవు మండలాలను త్వరలోనే ప్రకటించేందుకు అవసరమైన చర్యలు ప్రభుత్వం చేపట్టిందని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. మీడియా సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎస్ వెంకటేశ్వర్, అదనపు సంచాలకులు డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యూనియన్‌లతో ప్రమేయం లేకుండా జర్నలిస్టులందరికీ విశాఖ, హైదరాబాద్ తరహాలో సభ్యత్వం కల్పించాలని కోరారన్నారు. అంతకు ముందు విజయవాడ ప్రెస్‌క్లబ్‌పై విలేఖర్ల మంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు.