కృష్ణ

24వ తేదీ నాటికి జిల్లాలో నూరు శాతం సర్వే పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 18: జిల్లాలో ఈ నెల 24వ తేదీ నూటికి నూరు శాతం ప్రజాసాధికార సర్వే పూర్తిచేస్తామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ప్రజాసాధికార సర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో మంగళవారం ఉదయం సిసిఎల్‌ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అనీల్ చంద్ర పునీఠ, సిఎం ఆర్‌ఓ ప్రాజెక్టు డైరక్టర్ రంజిత్ పాషా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌లో ఇన్‌ఛార్జి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 85 శాతం పైగా ప్రజాసాధికార సర్వే పూర్తిచేశామన్నారు. అర్బన్ ప్రాంతంలో 51కి పైగా పూర్తి చేశామని, మిగిలిన సర్వేను ఈ నెల 24వ తేదీ నాటికి నూరు శాతం పూర్తిచేసేలా వేగవంతం చేస్తున్నామన్నారు. నగరపాలక సంస్థలో 4 లక్షల 36 వేల జనాభాకు 44 శాతం పైగా పూర్తి చేశామని, దీన్ని మరింత వేగవంతం చేసేందుకు నగరపాలక సంస్థకు అవసరమైన డివైజ్‌లు, ఎన్యూమరేటర్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి నగరపాలక సంస్థ కమిషనర్ వీరపాండ్యన్‌తో సమన్వయపరచుకుని నూరు శాతం లక్ష్యాన్ని చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్యూమరేటర్ల, అధికారులతో రోజువారీ సమీక్షలు నిర్వహించి ఎన్యూమరేటర్లను అదనంగా నియమించుకుని ఈనెల 24 నాటికి సర్వే పూర్తిచేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గంధం చంద్రుడు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అసిస్టెంట్ కలెక్టర్ డికె బాలాజీ పాల్గొన్నారు.