కృష్ణ

హైబ్రీడ్ విత్తనాల పేరిట రైతులను మోసగిస్తే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 18: హైబ్రిడ్ విత్తనాల పేరుతో రైతులను మోసగిస్తే సహించే ప్రసక్తేలేదని అటువంటి కంపనీలపైన, డీలర్లపైన, డిస్ట్రిబ్యూటరీలపై కఠినంగా వ్యవహరిస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం రాత్రి మీడియా పాయింట్ వద్ద తెలిపారు. ఇప్పటికే జీవా, బ్రహ్మపుత్ర, కావేరి సీడ్స్ కంపెనీలు హైబ్రిడ్ విత్తనాల పేరుతో రైతులను మోసం చేసినట్టు తెలియవస్తోందన్నారు. అటువంటి వారిపై పిడి యాక్ట్‌ను అమలుచేసి కఠినంగా శిక్షించాలని నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఆయా కంపెనీల ద్వారా చెల్లింపులు చేయాలని మంత్రిమలండలిలో నిర్ణయం తీసుకున్నామన్నారు. జీవా, బ్రహ్మపుత్ర కంపెనీలు మిరప విత్తనాలను కావేరి సీడ్స్ ప్రత్తి విత్తనాలను విక్రయం జరిపినట్లు రైతులు ఫిర్యాదు చేశారన్నారు. బ్రహ్మపుత్ర కంపెనీపై 831 మంది 317 కిలోలు కొనుగోలు చేసినట్లు ఫిర్యాదు చేశారన్నారు. 2852 ఎకరాల్లో పంట వేసినట్లు పేర్కొన్నారన్నారు. వారు అమ్మినది హైబ్రిడ్ విత్తనాలు కావని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ఇప్పటికే జీవా కంపెనీ మేనేజింగ్ డైరక్టర్‌ను అరెస్టు చేశామని, బ్రహ్మపుత్ర కంపెనీ నిర్వాహకుల కోసం అనే్వషిస్తున్నామని, వారి వివరాలను తెలిపి పట్టించినవారికి లక్ష రూపాయలు బహుమానాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. రేపటిలోగా అరెస్టులు జరగాలని లేనిఎడల పేపరు ప్రకటన జారీ చేస్తామన్నారు. కావేరీ సీడ్స్ కంపెనీకి రూ.42.43 లక్షల నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించాల్సిందిగా నోటీసులు జారీ చేశామని, రేపటితో గడువు ముగుస్తుందని, ఈ విషయమై కమిషనర్‌కు తగిన సమాచారాన్ని అందించాలని ఆదేశించామని, సమాధానం రాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. హైబ్రిడ్ కాని విత్తనాలను రైతులకు మోసపూరితంగా అమ్మకం జరిపితే కంపెనీపై చర్యలతో పాటు డిస్ట్రిబ్యూటర్ లైసెన్స్‌ను రద్దుచేస్తామని, డీలర్లపై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రిమండలి నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. రైతుల పక్షాన ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, వారిని మోసం చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇప్పటికే 15 మంది డీలర్లను సస్పెన్షన్‌లో పెట్టామని సంబంధిత డిస్ట్రిబ్యూటర్ల లైసెన్సును రద్దుచేశామన్నారు.
బయోప్రాడెక్ట్ పేరుతో సరుకులను అమ్ముతున్న సంస్థలను గుర్తించామన్నారు. 210 మంది ఈ విషయమై కోర్టులుకెళ్లారని, కోర్టు పరిశీలన చేసి కమిషనర్ ఆధ్వర్యంలో శాంపిల్స్ పరిశీలించేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. 51 కంపెనీలకు చెందిన 109 శాంపిళ్ల క్వాలిటీని పరిశీలించామన్నారు. అవి బయోప్రొడక్ట్స్ కావని నిర్ధారించామన్నారు. బయోప్రొడక్ట్ పేరుతో మోసం చేస్తే ఊరుకోమని అటువంటి సరుకులను అమ్మే డీలర్లపైన, డిస్ట్రిబ్యూటర్‌పైన చర్యలు తీసుకుంటామన్నారు. న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా హైకోర్టుకు వెళుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక అడ్వకేట్‌ను నియమిస్తున్నామన్నారు. ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా 210 కంపెనీల్లో జరిగే ఉత్పత్తులపై నాణ్యతా పరిశీలన చేపట్టి నివేదిక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.