కృష్ణ

వృత్తి పట్లే కాదు... ఆరోగ్యమూ ముఖ్యమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 18: ఉద్యోగం ఎక్కడికీ పోదని, ఎప్పుడూ ఉంటుందని..కాని ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహిస్తే.. ఆయుష్షుకే ప్రమాదమని డిజిపి నండూరి సాంబశివరావు పోలీసు సిబ్బందినుద్ధేశించి అన్నారు. ఇప్పటికే పోలీసులు మేల్కోని తమ ఆరోగ్యం పట్ల వైద్యం పట్ల దృష్టి సారించాలని సూచించారు. నగర పోలీసుకమిషనరేట్‌లోని సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారిలోని సమస్యలను గుర్తించి వైద్య చికిత్సలకు సిఫార్సు చేయడం ఒక మంచి కార్యక్రమమని, సేవా స్ఫూర్తితో పోలీసులకు డీప్ ఫౌండేషన్ అందించిన సహకారం అనిర్వచనీయమని మరోవైపు నగర పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ ప్రశంసించారు. నగర పోలీసు కమిషనరేట్‌లోని 2300మంది పోలీసు సిబ్బందికి ఇటీవల డీప్ (డిసీజ్ ఎరాడికేషన్ త్రో ఎడ్యుకేషన్ అండ్ ప్రివెన్షన్) ఫౌండేషన్ వైద్య బృందం ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించింది. బిపి, సుగర్, క్యాన్సర్, గ్యాస్ట్రిక్, గర్భసంచి, మూత్ర పిండాల సమస్యలు, లివర్, ఊపిరితిత్తులు, గుండె సంబంధ వైద్య పరీక్షలు ఒక్కొక్కరికి సుమారు 20నుంచి 25వేల రూపాయల వరకు ఖర్చు అయ్యే పరీక్షలు ఉచితంగా నిర్వహించింది. వీరిలో సుమారు 800మందిని పలు ఆరోగ్య సంబంధ సమస్యలున్నట్లుగా గుర్తించి వారిని వెంటనే తక్షణ వైద్య చికిత్సలకు సిఫార్సులు చేసింది. ఈ ప్రాజెక్టు ప్రయోగాత్మకంగా కమిషనరేట్‌లో తొలిసారిగా చేపట్టి విజయవంతగా సేవలందించినందుకుగాను నగర పోలీసుశాఖ తరుఫున డీప్ వైద్య బృందాన్ని సీపి సవాంగ్ సత్కరించారు. ఎన్‌ఏసి కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డిజిపి చేతుల మీదుగా వైద్యులను శాలువాతో సన్మానించి మెమొంటోలు అందచేశారు. ఈసందర్భంగా డిజిపి మాట్లాడుతూ పోలీసులకు సంక్రమించి ఆరోగ్య భద్రత పథకం ద్వారా డీప్ వైద్య బృందంచే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఈ పైలెట్ ప్రాజెక్టు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. పోలీసు కుటుంబసభ్యులకు సైతం ఈ వైద్య పరీక్షలు అందేలా కృషి చేస్తున్నామన్నారు. దేహ దారుఢ్య పరీక్షలు ద్వారా పూర్తిస్థాయి ఆరోగ్యంతో పోలీసుశాఖలో చేరిన సిబ్బంది కేవలం తన 15ఏళ్ల సర్వీసులో తీవ్ర అనారోగ్యపాలై అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఒత్తిడితో కూడిన విధి నిర్వహణే ఇందుకు కారణమన్నారు. అందువల్ల నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ ముందుగానే మేల్కొని ఇలాంటి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీపి సవాంగ్ మాట్లాడుతూ నగర పోలీసుశాఖకు డీప్ ఫౌండేషన్ అందించిన సేవలు ఎంతో సంతృప్తికరంగా ఉందన్నారు. సామాజిక భద్రత కల్పించే పోలీసులు తమ ఆరోగ్యానికి మాత్రం సరైన భద్రత తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. డీప్ అందించిన ఈ పరీక్షలు ద్వారా సమస్యలు ఉన్నవారు వెంటనే అప్రమత్తమయ్యారని ఇది చాలా శుభపరిణామన్నారు. డీప్ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో సమస్యలు గుర్తించిన సిబ్బంది పలువురు వేదికపైకి వచ్చి తమ అనారోగ్యాన్ని గూర్చి వివరించి తాము ముందుగా తెలుసుకోవడం ద్వారా ప్రస్తుతం తొలిదశలోనే వైద్యం తీసుకుని నియంత్రించుకొనేందుకు అవకాశం ఏర్పడిందని సీపికి కృతఙ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో డీప్ వైద్య బృందం డాక్టర్ కలపాల రాకేష్, డాక్టర్ అనె్న జగదీష్, డాక్టర్ పి రమేష్, డిసిపిలు జివిజి అశోక్‌కుమార్, జి పాలరాజు, కోయ ప్రవీణ్, కాంతి రానాటాటా మొత్తం కమిషనరేట్‌లోని సుమారు 500మంది పోలీసు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.