కృష్ణ

ఎఇఒ పథకాన్ని ఎగుమతి, దిగుమతిదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, అక్టోబర్ 22: కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన ఎ.ఇ.ఓ పథకం (అధీకృత ఆర్థిక నిర్వహణ) ఎగుమతి, దిగుమతిదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని వ్యాపారులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ కమిషనర్ ఎస్.కె.రెహమాన్ సూచించారు. శనివారం బెంజిసర్కిల్ సెంటర్‌లోని ఐలా హోటల్‌లో ‘కస్టమ్స్ అధీకృత ఆర్థిక నిర్వహణ’ భాగస్వామ్యం అంశంపై భారత పరిశ్రమ సమాఖ్య (సిఐఐ), కస్టమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో వ్యాపారులకు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ రెహమాన్ మాట్లాడుతూ ఎఇఓ సర్ట్ఫికెట్ కలిగిన వారు ఎగుమతి సమయంలో ఫ్యాక్టరీలో ఎగుమతికి నిర్ణయించిన సరకు నింపుకున్న కంటైనర్లు ఏ విధమైన అడ్డంకులు లేకుండా నేరుగా పోర్టులోకి ఎగుమతికి తీసుకెళ్ళే సదుపాయం ఉందన్నారు. దిగుమతి సమయంలో ఇంపోర్టర్స్‌కు సకాలంలో డాక్యుమెంట్లు నమోదు సరకు సత్వర తరలింపు వంటి ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఎగుమతి దిగుమతిదారులతో పాటు (ఆధీకృత ఆర్థిక నిర్వాహకుడు) గుర్తింపు పొందాలన్నారు. ఎఇఓలు కస్టమ్స్ అధికారులను కలుసుకోవలసిన అవసరం కనీస స్థాయికి వచ్చేలా నాలుగు అంచెల ప్రమాణ గుర్తింపు పత్రం విధానం కల్పించామన్నారు. దస్తావేజుల సత్వర పరిష్కారం, సత్వర అనుమతులు కారణంగా వ్యయ నియంత్రణ, సమయం ఆదా వంటి బహుళ ప్రయోజనాల పొందే అవకశాం కలుగుతుందన్నారు. వ్యాపారులు తమ పరిధిలోని రిఫండ్ డ్రాబాక్ క్లయిమ్స్ చెల్లింపులకు అధికారులు కలుసుకోవల్సిన పని ఉండదని స్పష్టం చేశారు. సిఐఐ విజయవాడ బ్రాంచ్ ఛైర్మన్ జి. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఏడాదికి 25 మంచి ఎగుమతి, దిగుమతుల నిర్వహించే చిన్న, మధ్య తరహా సంస్థలు కూడా ఎఇఓ పథకం ప్రయోజనాలు పొందవచ్చన్నారు. అనంతరం కమిషనర్ ఎఇఓ పథకం బ్రోచర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ నాయకులు ముత్తవరపు మురళి, పొట్లూరి భాస్కరరావు, వక్కలగడ్డ భాస్కరరావు, కృష్ణపట్నం పోర్ట్ అధికారి మూర్తి, కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్ డి.సతీష్, సూపరింటెండెంట్లు గుమ్మడి సీతారామయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

పేదలకు ఉన్నత వైద్యమే ప్రభుత్వ లక్ష్యం
* వర్ల రామయ్య
పామర్రు, అక్టోబర్ 22: పేదలకు ఉన్నత స్థాయి వైద్యసేవలు అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్, పామర్రు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ వర్ల రామయ్య చెప్పారు. శనివారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ఈ నెల 23న మధ్యాహ్నం 2గంటలకు పామర్రు ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా నిర్మించిన అదనపు భవనాలను రాష్ట్ర వైద్యవిద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభిస్తారని తెలిపారు. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా దాదాపు అన్ని రోగాలకు ఉన్నత స్థాయి వైద్యసేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 23న ఉదయం 9గంటలకు వీరంకిలాకులో నూతనంగా నిర్మించిన ఆసుపత్రిని మంత్రి ప్రారంభిస్తారన్నారు. కపిలేశ్వరపురం గ్రామంలోని ఆసుపత్రికి ప్రహరీ నిర్మాణం, అదనపు సౌకర్యాలకు మంత్రి భూమిపూజ చేస్తారని తెలిపారు. పెదపారుపూడి మండలం ఎలమర్రులో, మొవ్వ మండలం నిడుమోలులో ఆసుపత్రుల నూతన భవనాలను మంత్రి ప్రారంభిస్తారన్నారు. పామర్రులో జరిగే ప్రారంభోత్సవంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వర్ల వివరించారు.

జన్మభూమి కమిటీలను రద్దుచేయాలి
* సిపిఎం డిమాండ్
మైలవరం, అక్టోబర్ 22: జన్మభూమి కమిటీలను వెంటనే రద్దుచేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ పశ్చిమ కృష్ణా కార్యదర్శి డివి కృష్ణ, డివిజన్ కార్యదర్శి తమ్మా రాంబాబు, తదితరులు శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ జన్మభూమి కమిటీల వల్ల ప్రభుత్వ పథకాలు అర్హులకు అందటం లేదని ఆరోపించారు. కమిటీలు ఇస్టానుసారంగా వ్యవహరిస్తూ తమ కనుసన్నల్లో ఉండేవారికే లబ్ధి చేకూరుస్తున్నారన్నారు. కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులకు పథకాల వర్తింపులో అవకాశం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో రాజకీయ జోక్యం మితిమీరిపోయిందని తెలిపారు. ముఖ్యంగా పక్కా ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రుణాలు అర్హత కలిగిని వారికి దక్కటం లేదని వాపోయారు. జన్మభూమి కమిటీలకు ఇంతటి అధికారం ఏ రాజ్యాంగం, ఏ చట్టం ప్రకారం ఇచ