కృష్ణ

ఇందిరమ్మ రాజ్యమొస్తే ఇంటింటా సౌభాగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 5: భారతరత్న ఇందిరా గాంధీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ‘ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యం’ నినాదంతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏడాదిపాటు రాష్టవ్య్రాప్తంగా ఇందిరమ్మ స్ఫూర్తిని నేటి యువతకు అర్థయ్యేలా కార్యక్రమాలు నిర్వహించనుందని ఎపిపిసిసి చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎంపి తులసి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజులతో కలిసి ఇందిరా గాంధీ శతజయంతి ఉత్సవ కమిటీ పోస్టర్‌ను, ఈ నెల 19న కర్నూల్‌లో జరగబోయే భారీ రైతు సదస్సు పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాలను ఈ నెల 19 నుంచి వచ్చే ఏడాది నవంబర్ 19 వరకు రాష్టవ్య్రాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను మొత్తం 10 కమిటీలను నియమించినట్లు వివరించారు. ఇందిరమ్మ దేశానికి చేసిన సేవలను, త్యాగాలను అందరికీ స్ఫూర్తిని రగిలించేలా వివరించేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. బిబిసి సర్వే ప్రకారం గత వేయి సంవత్సరాల కాలంలో ప్రపంచంలో మేటి మహిళ నెంబర్-1 స్థానం ఇందిరమ్మకే దక్కిందన్నారు. బిజెపి నాయకుడు వాజపేయి అపర దుర్గాదేవిగా ఇందిరమ్మను ప్రశంసించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పార్టీలో వ్యతిరేకతను లెక్కచేయకుండా రాజాభరణాలను రద్దుచేసిన మహానేత అని, నేడు 130 కోట్ల మంది భారతీయులకు తిండిగింజలకు లోటులేకుండా హరిత విప్లవానికి నాంది పలికిన నేత అని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఉక్కు మహిళ, హరిత విప్లవ సారథి ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాల ప్రారంభ సందర్భంగా ఈ నెల 19న కర్నూలులో భారీ రైతు సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యఅతిథిగా ఎంపి మల్లిఖార్జున్ ఖర్గే, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పాల్గొంటారని ఆయన వివరించారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తన వల్లే ఎపికి మేలు జరిగిందని ప్రచారం, సన్మానాలు చేయించుకున్నారని, ఈనాడు ప్యాకేజీ మేలంటే అది అజ్ఞానంతోనా, లేక మోసం చేయడమా? అని రఘువీరారెడ్డి ప్రశ్నించారు.

రాజధాని నగర పరిధిలోని
గ్రామాల పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ
* అధికారులకు సిఆర్‌డిఏ కమిషనర్ శ్రీ్ధర్ ఆదేశం

విజయవాడ, నవంబర్ 5: రాజధాని నగరం అమరావతి పరిధిలోని గ్రామాలన్నింటిలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఆయా గ్రామ కార్యదర్శులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఎపి సిఆర్‌డిఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ ఆదేశించారు. విజయవాడ ఏపి సిఆర్‌డిఏ కార్యాలయంలో శనివారం రాజధాని నగర పరిధిలోని గ్రామాల విలేజ్ సెక్రటరీలు, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ల సమావేశంలో గ్రామాల పారిశుద్ధ్యం ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు. సొసైటీ ఫర్ రూరల్ అవేకనింగ్ అండ్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ (ఎస్‌ఆర్‌ఎసిఓ) ప్రతినిధులు కూడా పాల్గొన్న ఈ సమావేశంలో రాజధాని నగర పరిధిలోని గ్రామాల పారిశుద్ధ్య కార్యక్రమానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని కమిషనర్ చెప్పారు. వెంకటపాలెం గ్రామానికి ఐదు చెత్త తరలించే రిక్షాలు, ఇంటింటికీ 2,400 డస్ట్‌బిన్స్ కూడా అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఏపి సిఆర్‌డిఏ తరపున సహకారం ఉంటుందని, ఇంటింటికీ 10 రూపాయల చొప్పున వసూలు చేసి చెత్త తరలించే కార్మికులకు అందజేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతం వున్న డంపింగ్ యార్డుల దగ్గర చుట్టూ షీట్లు అమర్చాలన్నారు. అన్ని గ్రామాల్లో సర్పంచ్, విలేజ్ సెక్రటరీలు కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించి గ్రామాలన్నీ శుభ్రంగా వుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వీధులు శుభ్రం చేసేందుకు డ్వాక్రా మహిళల సేవలు వినియోగించుకోవాలన్నారు. రాజధాని నగర పరిధిలోని గ్రామాల్లో వేస్ట్ మేనేజ్‌మెంట్ ఎలా చేయాలనే అంశంపై విలేజ్ సెక్రటరీలు, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లకు ఏపి సిఆర్‌డిఏ అదనపు కమిషనర్ డాక్టర్ ఎ మల్లికార్జున తగిన సూచనలు చేశారు. కృష్ణాయపాలెంలో నిర్మిస్తున్న కంపోస్ట్ యార్డ్ వివరాలు తెలియజేశారు. ఈ సమావేశంలో గుంటూరు డిఎల్‌పివో ఎంఈఎస్ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఆర్‌ఎసిఓ డైరక్టర్ జనరల్ సునీతా ప్రసాద్, ఏపి ఇన్‌చార్జ్ వసంతమణి పాల్గొన్నారు.

ఘనంగా ముగిసిన కళాదర్శిని కళాఉత్సవ్
పటమట, నవంబర్ 5: నాలుగు రోజులుగా ఆంధ్ర లయోలా కళాశాలలో కళాదర్శిని వారు నిర్వహిస్తున్న 20వ కళాఉత్సవం శనివారం సాయంత్రంతో ఘనంగా ముగిశాయి. గాత్రం, భరత నాట్యం, కూచిపూడి నృత్యం, బృందగానం, బృందనృత్యం, చిత్రలేఖనం తదితర విభాగాల్లో నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు గద్దె రామమోహన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కళలను ప్రొత్సహిస్తోందన్నారు. కళలపై విద్యార్థులు మక్కువ పెంచుకోవావాలని అందుకు తల్లిదండ్రులు కూడా ప్రొత్సహించాలని కోరారు. కళలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయన్నారు. ఆంధ్ర లయోలా కళాశాల విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన విద్యనిందిస్తూ కళలకు కూడా పెద్ద పీట వేయటం అభినందనీయమన్నారు. రెండు దశాబ్దలాకు పైగా కళాదర్శిని వందలాది మంది విద్యార్థులను వివిధ కళలలో నైపుణ్యం పెంపొదించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దటం హార్షణీయమన్నారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అలరించాయి. ఈ సందర్భంగా కూచిపూడి నాట్యాలయ ప్రిన్సిపాల్ రామలింగ శాస్ర్తీ, బహుబలి చిత్రానికి నేపథ్యగానం చేసిన రేవంత్‌ను కళాదర్శిని డైరెక్టర్ ఫాదర్ రవీంద్ర తదితర ఫాదర్స్ ఘనంగా సత్కరించారు.

అవినీతి వ్యతిరేకంగా వాక్‌ధన్ ర్యాలీ
పటమట, నవంబర్ 5: కస్టమ్స్, ఇన్‌కంటాక్స్ శాఖ ఆధ్వర్యంలో ఆరు రోజులుగా నిర్వహిస్తున్న విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 6.30 గంటలకు చివరిరోజు మహాత్మా గాంధీ రోడ్డులో ఉద్యోగులు వాక్‌ధన్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని తెలుగు రాష్ట్రాల ఇన్‌కంటాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ అజిత్‌కుమార్ శ్రీవత్సవ బెలూన్లు వదిలి జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతిపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ ఉద్యోగుల సహకారంతో వాక్‌ధన్ నిర్వస్తున్నామన్నారు. అవినీతి నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం మరింతగా పెరగాలన్నారు. ఇన్‌కంటాక్స్ చీఫ్ కమిషనర్ ఎస్‌పి చౌదరి మాట్లాడుతూ అవినీతి వల్ల అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. అవినీతికి పాల్పడేవారు, ప్రొత్సహించేవారు ఇద్దరికీ ఇందులో సమాన భాగస్వామ్యం వుందన్నారు. ఎపి కస్టమ్స్ కమిషనర్ ఎస్‌కె రెహమాన్ మాట్లాడుతూ ధర్మమార్గమే క్షేమకరం, శుభకరమన్నారు. అంతకుముందు మహాత్మా గాంధీ రోడ్డు ఎంవిఆర్ మాల్ నుండి ప్రారంభమైన ర్యాలీ ఇన్‌కంటాక్స్ కార్యాలయం వరకు సాగింది. కార్యక్రమంలో ఇన్‌కంటాక్స్ ఉన్నతాధికారులు ఇంటెలిజెన్స్ బ్యూరో ఎపి చీఫ్ ఆర్ చంద్రశేఖర్, నగర పోలీసు జాయింట్ కమిషనర్ పి హరికుమార్, అదనపు కమిషనర్ బి శ్రీనివాస్, జాయింట్ కమిషనర్లు టివిపి లత, శేష శ్రీనివాస్, సూపరింటెండెంట్ తిలక్ గుమ్మడి సీతారామయ్య, పాల్గొన్నారు.