కృష్ణ

చిన్న ప్రాజెక్టుల పనుల్లో జాప్యమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 28: పట్టిసీమ వంటి ప్రాజెక్టును సవాల్‌గా తీసుకుని పూర్తిచేశామని, పోలవరం ప్రాజెక్టు పనులు గాడిలో పడ్డాయని, కానీ చిన్న ప్రాజెక్టులను పూర్తిచేయడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. విజయవాడలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ప్రాధాన్య జలవనరుల పథకాలపై ఆయన సోమవారం సమీక్ష జరిపారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జనవరి నాటికి చిన్న ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఆదేశించారు. మార్చి నాటికి అన్ని పనులు పూర్తి కావాలన్నారు. హంద్రీ-నీవా కాలువ వెడల్పు పనులు వేగవంతం చేయాలని, అది పూర్తయితే రాయలసీమకు పూర్తిస్థాయిలో కృష్ణాజలాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. గొల్లిపల్లి రిజర్వాయరు పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. ఎల్-1, 4 పంపింగ్ స్టేషన్ల నుంచి నీరు లిఫ్ట్ చేసేందుకు సిద్ధమన్నారు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనుల వేగం పెంచాలని, డిసెంబర్ 31 నాటికి పూర్తిచేయాలన్నారు. చెర్లోపల్లి రిజర్వాయరు పనులు పూర్తయ్యాయని, అనుమతులు వచ్చాక పర్మినెంట్ డైవర్షన్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. భైరవతిప్ప ప్రాజెక్టు పనులు పూర్తయితే 22,352 ఎకరాలకు నీర ఇవ్వచ్చని అధికారులు నివేదికను సిఎంకు అందచేశారు. కుప్పం బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించిన మిగిలిన పనులు జనవరి నాటికి పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. ఎండాకాలంలోగా చెరువులను నింపాలని, రబీలో ఎక్కడా ఎకరం పొలం కూడా ఎండిపోకూడదని, అవసరమైతే మొబైల్ ఇరిగేషన్ ద్వారా నీరు ఇవ్వాలన్నారు. నీవా బ్రాంచ్ కెనాల్ పనుల వేగం పెంచాలని, పుంగనూరు బ్రాంచ్ కెనాల్ 27, 28 ప్యాకేజీ పనులు సత్వరమే పూర్తిచేయాలని, చిత్రావతి నీళ్లు అనంతపురానికి తీసుకువెళ్లాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
సిమెంట్ కంపెనీలపై సిఎం ఆగ్రహం
పోలవరం పనులు జరుగుతున్న తీరును విజయవాడ నుంచి వర్చువల్ ఇన్‌స్పెక్షన్ చేశారు. పోలవరం నిర్మాణానికి సిమెంట్ లభ్యత, ధరలపై చర్చించేందుకు సిమెంట్ కంపెనీల యాజమాన్యాలను ఆహ్వానిస్తే వారు గైర్హాజరై ప్రతినిధులను మాత్రమే పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు తన కోసం నిర్మించుకుంటున్నది కాదని, ప్రతిఒక్కరూ బాధ్యతగా మెలగాలన్నారు. డిసెంబర్ 10 నాటికి కాంక్రీటు పనులు మొదలుపెడతామని తెలిపారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పనిచేసినప్పుడే పూర్తవుతాయని ఆయన స్పష్టం చేశారు. జనవరి మొదటి వారంలో డయాఫ్రం వాల్ పనులు, 14 నాటికి గేట్ల పనులు ప్రారంభం కావాలని చంద్రబాబు నిర్దేశించారు.

నగరంలో బంద్ నామమాత్రం
* వామపక్షాల ప్రదర్శన భగ్నం
* నేతలు, కార్యకర్తల అరెస్ట్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 28: పెద్దనోట్ల రద్దు, నోట్ల మార్పిడి ప్రక్రియలో సామాన్యులను బలిపెట్టే కేంద్ర ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ 10 జాతీయ వామపక్ష పార్టీలు ఇచ్చిన దేశ వ్యాప్త హర్తాళ్ పిలుపులో భాగంగా సోమవారం రాష్ట్ర రాజధాని నగరం విజయవాడలో హర్తాళ్ (బంద్) ప్రభావం నామమాత్రంగా జరిగింది. బ్యాంకులు, ఆసుపత్రులు, తాగునీరు, విద్యుత్ అత్యవసర సర్వీసులు మినహా వ్యాపార, వర్తక, వాణిజ్య, సినీ పరిశ్రమ, విద్యా సంస్థలన్నీ స్వచ్ఛందంగా మూతబడ్డాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఎంసిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్, వాటి అనుబంధ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నగరంలో నియోజకవర్గాల వారీగా ర్యాలీలు నిర్వహించారు. తెరచి ఉన్న పలు షాపులన్నీ మూయించారు. లెనిన్ సెంటర్‌లో, పటమట ఎన్టీఆర్ సెంటర్‌లో, వన్‌టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలను అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా వాహనాలతో వెంటాడారు. తొలుత లెనిన్ సెంటర్‌లో వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడే నేతలు మీడియాతో మాట్లాడారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ నోట్ల రద్దు, మార్పిడితో 20 రోజులుగా సామాన్యులు పడరానిపాట్లు పడుతుండగా ప్రధాని మోదీ మొండిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మోదీ, వెంకయ్య నాయుడు దమ్ము, ధైర్యం ఉంటే విదేశాల్లో మూలుగుతున్న రూ. 80 లక్షల కోట్లు రప్పించాలి తప్ప అతి సామాన్యుల్ని, రైతుల్ని, కూలీలను, చేతివృత్తుల వారిని ఇబ్బంది పెట్టడం సరైంది కాదన్నారు. మంత్రి బండారు దత్తాత్రేయ కూతురు పెళ్లి భోజనాలకే రూ.50 లక్షలు ఖర్చు చేసింది, టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ తన ఇంట్లో శుభకార్యంలో భోజనాలకు ఆరు లక్షలు ఖర్చు చేశారు. బిజెపి నేత, మైనింగ్ మాఫియా గాలి జనార్థన్ రెడ్డి రూ.500కోట్లు ఖర్చు చేసింది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబూరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, ఏపి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య, ఐద్వా నాయకురాలు డి రమాదేవి తదితర నేతలు మాట్లాడుతూ ఇదంతా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మోడీ జోడి ఆడుతున్న నాటకాలని దుయ్యబట్టారు. తక్షణమే చిన్ననోట్లు అందుబాటులోకి తెచ్చి సామాన్యులపై ఆంక్షలు ఎత్తివేయాలని ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. అనంతరం నాయకులంతా అగ్రభాగాన నిలవగా లెనిన్ సెంటర్ నుండి బయలుదేరిన ప్రదర్శన బీసెంట్ రోడ్డు మీదుగా వెళుతుండగా పోలీసులు వెంటాడి, ప్రదర్శనను దారిమళ్లించారు. గోపాలరెడ్డి రోడ్డులో రాజగోపాలాచారి వీధి జంక్షన్‌లో ప్రదర్శనకారులను పోలీసులు చుట్టుముట్టారు. దీంతో పోలీసులకు, ప్రదర్శనకారులకు కొద్దిసేపు తోపులాట జరిగింది. పోలీసులు పెద్దసంఖ్యలో ఉండడంతో వారంతా ప్రదర్శనకారులను చుట్టుముట్టి నాయకుల్ని, కార్యకర్తల్ని ఈఢ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లో పడేసి, జిల్లాలోని ఉయ్యూరు, తోట్లవల్లూరు, ఇబ్రహీంపట్నం తదితర పోలీసు స్టేషన్‌లకు తరలించారు. పోలీసు జులం నశించాలంటూ ఈ సందర్భంగా కార్యకర్తలు నినాదాలు చేశారు. అరెస్టైన సిపిఐ నాయకులు కె రామకృష్ణ, అక్కినేని వనజ, దోనేపూడి శంకర్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, లిబరేషన్, ఓపిడిఆర్ తదితర వామపక్ష పార్టీల నాయకులు డి హరినాథ్, జి సత్యనారాయణ, కె ఏసు,సిపిఐ నగర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ శ్రీనివాస్ తదితరులను ఉయ్యూరు పోలీసు స్టేషన్‌కు, ఏపి రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవివి ప్రసాద్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు పరుచూరి రాజేంద్ర, నగర నాయకులు పరసా భవన్‌చంద్‌లను తోట్లవల్లూరు పోలీసు స్టేషన్‌లకు తరలించారు. వన్‌టౌన్‌లో వామపక్షాల నిరసన ప్రదర్శన సిపిఐ కార్యాలయం లెనిన్ భవన్ నుండి ప్రారంభమై సామారంగం చౌక్, మీదుగా కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్‌కు చేరుకోగానే పోలీసులు నాయకుల్ని అరెస్ట్ చేయడం ప్రారంభించారు. సిపిఐ నగర సహాయ కార్యదర్శి జి కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు డివి రమణబాబు, తాడి పైడియ్య, కొట్టు రమణరావు, సిపిఎం నాయకులు డివి కృష్ణ తదితరులను అరెస్ట్ చేసి ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు తరలించారు. అదే విధంగా పటమటలో సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఆటోనగర్ గేటు వరకు భారీ ప్రదర్శన కొనసాగింది. నాయకులు, కార్యకర్తల పార్టీ పతాకాలు చేతబూని ప్రదర్శన కొనసాగిస్తూ రోడ్డు వెంబడి షాపులన్నీ మూయించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శివర్గ సభ్యులు లంకా దుర్గారావు, కార్యవర్గ సభ్యులు నూతక్కి సీతారామయ్య, ప్రసాద్, సూరిబాబు, ఏఐవైఎఫ్ నాయకులు మోతుకూరి అరుణ్‌కుమార్, సిపిఐ శాఖ కార్యదర్శులు పరుచూరి అజయ్, ఆకుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నోట్లరద్దు, మార్పిడి ప్రక్రియను నిరసిస్తూ సిటి కాంగ్రెస్ పార్టీ, వైసిపి, ఆమ్ ఆద్మీ పార్టీలు వేర్వేరుగా నగరంలో ఆందోళనలు చేపట్టాయి.

21వ శతాబ్దపు తుగ్లక్ ప్రధాని మోదీ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, నవంబర్ 28: పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో చిల్లర నోట్లకు కరువొచ్చి సామాన్య ప్రజలకు వణుకొస్తోందని ఏపిసిసి అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న అనాలోచిత, ఏకపక్ష నిర్ణయాల వల్ల గ్రామీణ భారత ప్రజానీకం ఆర్థికంగా చితికి శల్యమై పోతోందన్నారు. ఏఐసిసి ఆదేశాల మేరకు పెద్దనోట్ల రద్దుకు నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా నగరంలో జరిగిన ర్యాలీలో ఆయన, ఏపిసిసి ప్రధాన కార్యదర్శులు, నగర కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, విద్యార్థి విభాగం నాయకులతో కలిసి పాల్గొన్నారు. తొలుత ఏపిసిసి రాష్ట్ర కార్యాలయంలో రఘువీరారెడ్డి మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూలే అధునిక భారతదేశంలో మానవ హక్కుల కోసం పోరాడిన నాయకుడన్నారు. అనంతరం పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా నగన కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీలో రఘువీరారెడ్డి రాష్ట్ర కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి లెనిన్ సెంటర్‌ల మానవహారం నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్లను రద్దు కారణంగా దేశంలో అప్రకటిత ఆర్థిక సంక్షోభానికి బిజెపి ప్రభుత్వం మూలం అయిందన్నారు. ప్రస్తుత ప్రధాని మోదీ 21వ శతాబ్దపు తుగ్లక్‌గా ప్రజల నుండి విమర్శలందుకుంటున్నారన్నారు. నల్లధనం తీసుకురావడంలో విఫలమైన ప్రధాని మోదీ దేశంలోని తెల్లధనాన్ని బ్యాంకుల్లో జమ చేయడం ద్రోహపూరిత చర్య అన్నారు. లక్షా, 20వేల కోట్ల రూపాయలను సబ్సిడీ రూపంలో నల్లకుబేరులకు రద్దు చేసిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నిరసనకు ప్రజలే నాయకత్వం వహిస్తున్నారన్నారు. చంద్రబాబు ఎంత అభద్రత భావంలో ఉన్నారో అర్థం అవుతుందన్నారు. అనంతరం బైక్‌పై రాష్ట్ర కార్యాలయానికి బయలుదేరారు.