కృష్ణ

త్వరలో రెండవ రైతు బజార్‌ను ఏర్పాటు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), డిసెంబర్ 3: పట్టణంలో మరో రైతుబజారు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాజుపేట మీ-సేవా కేంద్రం సమీపంలో రైతుబజారును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జన చైతన్య యాత్రల్లో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక 31, 32, 33, 34 వార్డుల్లో ఆయన పర్యటించారు. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ పట్టణంలో ఒకే ఒక్క రైతుబజారు ఉండటంతో ప్రజలు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. త్వరలోనే రైతుబజారు నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. పట్టణానికి ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ కింద రూ.7కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులను త్వరలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 3లక్షల అదనపు పెన్షన్‌ల పంపిణీకి కేబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టిడిపి పట్టణ అధ్యక్షులు ఇలియాస్ పాషా, కౌన్సిలర్లు నారగాని ఆంజనేయ ప్రసాద్, పల్లపాటి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

రెడీమేడ్ దుస్తుల గోడౌన్‌పై సీటీవో దాడి
* 1.60 లక్షల
అపరాధ రుసుం విధింపు
గుడివాడ, డిసెంబర్ 3: స్థానిక బస్టాండ్ సెంటర్లోని రెడీమేడ్, టెక్స్‌టైల్ దుస్తులను నిల్వచేసిన గోడౌన్‌పై గుడివాడ వాణిజ్య పన్నుల శాఖాధికారి పులివెందుల జయశంకర్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. ఈ సందర్భంగా దాదాపు రూ.కోటి విలువైన బిల్లులు లేని దుస్తులను గుర్తించారు. ఈ దుస్తులు రాజమండ్రి నుండి వచ్చినట్టుగా ట్రేడర్ సాంబశివరావు చెప్పారు. వెంటనే సిటివో జయశంకర్ రాజమండ్రి సిటివోకు సమాచారమిచ్చారు. పన్ను కట్టకుండా దుస్తులను గుడివాడ తరలించినట్టుగా తేలిందని, పన్ను కట్టించాలంటూ గుడివాడ సిటివో వివరించారు. ప్రస్తుతం ఇక్కడ గుర్తించిన రూ.కోటి విలువైన దుస్తులకు రూ.1.60లక్షల అపరాధ రుసుంను విధించారు. పన్ను చెల్లించని ట్రేడర్లపై చర్యలు తప్పవని సిటివో హెచ్చరించారు.

ఓవరాల్ చాంపియన్‌షిప్ కైవసం చేసుకున్న ‘ముసునూరు’

ముసునూరు, డిసెంబర్ 3: స్థానిక గురుకుల పాఠశాలలో నాలుగు రోజులుగా జరుగుతున్న 8 జిల్లాల ఆటల పోటీల్లో ఓవరాల్ చాంపియన్ షిప్‌ను ముసునూరు గురుకుల విద్యాలయానికి చెందిన విద్యార్థినులు కైవసం చేసుకున్నారు. వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ను గుంటూరు జిల్లాకు చెందిన వరలక్ష్మి కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సప్తమ ఆటల, క్రీడల పోటీలు శ్రీకాకుళం జిల్లా నుండి ఫ్రకాశం జిల్లా వరకు ఉన్న గురుకుల బాలికల విద్యాలయాలకు చెందిన విద్యార్థిను ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబర్చారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, త్రోబాల్, షాట్‌పుట్, చెస్, బాల్‌బ్యాట్మెంటన్, జావలిన్‌త్రో, డిస్క్‌త్రో, పరుగుపందెలలో విద్యార్థినులు పోటాపోటీగా ఆడారు. విజేతలకు శనివారం మూల్పూరి ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత మూల్పూరి లక్ష్మణస్వామి బహుమతులు అందజేశారు.