కృష్ణ

పతకాల పంట పండించని కృష్ణా వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 19: అఖిల భారత అంతర్ విశ్వ విద్యాలయాల ఆర్చరి ఛాంపియన్‌షిప్ పోటీలకు అతిథ్యమిచ్చిన కృష్ణా విశ్వ విద్యాలయం ఐదు పతకాలతో సరి పెట్టుకోవల్సి వచ్చింది. ఈ పోటీల్లో విశ్వ విద్యాలయం అనుకున్న స్థాయిలో పతకాలను సంపాదించలేకపోయింది. కృష్ణా విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో తొలిసారిగా స్థానిక హిందూ కళాశాల క్రీడా మైదానంలో ఐదు రోజులుగా నిర్వహించిన పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీల్లో కృష్ణా విశ్వ విద్యాలయానికి చెందిన నవీన్ కుమార్, అనూష రెడ్డిలు ఒక స్వర్ణ పతకాన్ని, మూడు రజత పతకాలు, ఒక కాంస్య పతకాన్ని సంపాదించారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో నవీన్, అనూష రెడ్డిల జోడీ ఒక రజత పతకాన్ని దక్కించుకుంది. నవీన్ ఒక్కడే నాలుగు వ్యక్తిగత పతకాలు సాధించటంతో పాటు అనూషరెడ్డితో కలిసి ఒక వెండి పతకాన్ని విశ్వ విద్యాలయానికి అందించాడు. పది మంది కూడిన జట్టులో నవీన్ కుమార్, అనూషరెడ్డిలు ఐదు పతకాలతో విశ్వ విద్యాలయం పరువును కొంత కాపాడగలిగారు. గత సంవత్సరం జరిగిన ప్రపంచ అంతర్ విశ్వ విద్యాలయాల ఆర్చరి రికర్వ్ విభాగంలో పాల్గొని 8వ స్థానంలో నిలిచిన రవళిపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఆమె అనారోగ్యం కారణంగా తొలి రోజే పోటీల నుండి నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో కృష్ణా విశ్వ విద్యాలయం జట్టు ఢీలా పడింది. కాంపౌండ్ విభాగంలో నవీన్ కుమార్ మాత్రం నాలుగు పతకాలతో విశ్వ విద్యాలయం పరువు కాపాడాడు. నవీన్ కుమార్ కాంపౌండ్ 50 మీటర్ల విభాగంలో ఒక వెండి పతకాన్ని, ఒక రజత పతకాన్ని, కాంపౌండ్ డబుల్ 50 విభాగంలో ఒక బంగారు పతకాన్ని ఓవరాల్‌గా పురుషుల కాంపౌండ్ విభాగంలో మరో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. వ్యక్తిగత ఒలంపిక్ రౌండ్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు.

ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టింగ్ టోర్నీ విజేత పశ్చిమగోదావరి జిల్లా కైవసం
గుడివాడ, ఫిబ్రవరి 19: గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన పర్వతనేని జగన్మోహనరావు మెమోరియల్ రాష్టస్థ్రాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లా ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. సీనియర్ మెన్ బెస్ట్‌లిఫ్టర్‌గా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎస్ రామ్మోహనరావు, సీనియర్ ఉమెన్ బెస్ట్ లిఫ్టర్‌గా విశాఖపట్నానికి చెందిన షేక్ అలీమాబేగం, జూనియర్ మెన్ బెస్ట్ లిఫ్టర్‌గా ప్రకాశం జిల్లాకు చెందిన ఏసుబాబు, ఉమెన్ బెస్ట్ లిఫ్టర్‌గా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఊహాసాయి ఎంపికయ్యారు. అలాగే స్ట్రాంగ్‌మెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎ గోవిందరావు, స్ట్రాంగ్ ఉమెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా కృష్ణాజిల్లాకు చెందిన కె శిరోమణిలు ఎంపికయ్యారు. జూనియర్, సీనియర్స్ పురుషుల, మహిళల విభాగాల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ ఆర్డీవో ఎం చక్రపాణి, వెయిట్‌లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కె సూర్యనారాయణరావు, కార్యదర్శి బివి రామయ్య, కమిటీ సభ్యులు నెరుసు శేషగిరి, జివి రాఘవేంద్రరావు, పిన్నమనేని సాంబశివరావు, పర్వతనేని ఆనంద్, బొగ్గరపు తిరుపతయ్య, కోచ్ మారెళ్ళ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వివాహబంధ విలువలను చాటిచెప్పిన సప్తపది
జి.కొండూరు, ఫిబ్రవరి 19: ఎపి భాషా సాంస్కృతిక శాఖ, ఆదర్శ గ్రామీణ సేవా సంస్థ ఆధ్వర్యంలో వెలగలేరులో నిర్వహిస్తున్న నాటకోత్సవాల్లో శనివారం రాత్రి ప్రదర్శించిన సప్తపది నాటిక విశేషంగా ఆకట్టుకుంది. అంజనా రాథోడ్ థియేటర్స్ చిలకలూరిపేట వారి సమర్పణలో ప్రదర్శించిన ఈనాటికను తాళాబత్తుల వెంకటేశ్వరరావు రచించారు. కెవి మంగారావు దర్శకత్వం వహించారు. భారతీయ సంస్కృతిలో వివాహ వ్యవస్థకున్న పవిత్రతను గురించి, వివాహ ప్రాధాన్యం, జీవితంలో విలువలు, వివాహానికి ఇవ్వాల్సిన గౌరవం, అహంకారంతో నేటి సమాజంలో యువకులు వివాహ బంధాన్ని నిర్వీర్యం చేస్తున్న వైనం, సంసారాలను నాశనం చేసుకుంటున్న విధానం, పెద్దవాళ్ళు యువజంటల అపోహలను పోగొడుతున్న వైనం, పెద్దల సలహాలతో అన్యోన్న దాంపత్యం, ఆనందకర జీవన విధానం గురించి నాటిక ద్వారా వివరించారు. కళాకారులు సాంబశివరావునాయక్, కెవి మంగారావు, హాసన్, హరిబాబు, విజయలక్ష్మీ తదితరుల చక్కని నటన కనబర్చారు. కళాకారులను, నిర్వాహకులను ప్రేక్షకులు ప్రత్యేకంగా అభినందించారు.

కాంపౌండ్, రికర్వ్ విభాగ పోటీ విజేతలు
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 19: స్థానిక హిందూ కళాశాల క్రీడా మైదానంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న అఖిల భారత అంతర్ విశ్వ విద్యాలయాల ఛాంపియన్ షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఇండియన్, కాంపౌండ్, రికర్వ్ విభాగాల్లో గెలుపొందిన విజేతలకు ఆదివారం సాయంత్రం అతిథుల చేతుల మీదుగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను అందజేశారు. కాంపౌండ్ పురుషుల టీమ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోగా మహిళల విభాగంలో పంజాబీ విశ్వ విద్యాలయం ఛాంపియన్‌గా నిలిచింది. సావిత్రా బాయి పూలే పూణే యూనివర్శిటీ, పంజాబీ యూనివర్శిటీలు పురుషుల కాంపౌండ్ టీమ్ ఛాంపియన్‌షిప్ విభాగంగా ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకున్నాయి. గురునానక్ దేవ్ యూనివర్శిటీ, కురుక్షేత్ర యూనివర్శిటీలు మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో దక్కించుకున్నాయి. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో పంజాబి యూనివర్శిటీ ప్రథమ స్థానం సాధించగా అతిథ్యమిచ్చిన కృష్ణా యూనివర్శిటీ ద్వితీయ స్థానాన్ని సాధించగా కురుక్షేత్ర యూనివర్శిటీ తృతీయ స్థానంలో నిలిచింది. రికర్వ్ టీమ్ ఛాంపియన్‌షిప్ విభాగంలో పురుషుల ఛాంపియన్‌షిప్‌ను కురుక్షేత్ర యూనివర్శిటీ, మహిళల ఛాంపియన్‌షిప్‌ను గురునానక్ దేవ్ యూనివర్శిటీలు కైవసం చేసుకున్నాయి. పురుషుల విభాగంలో పంజాబి యూనివర్శిటీ ద్వితీయ స్థానాన్ని, మహర్షి దయానంద్ యూనివర్శిటీ తృతీయ స్థానాన్ని సాధించగా మహిళల విభాగంలో యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ, సావిత్రా బాయ్ ఫూలే పూణే యూనివర్శిటీలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో పంజాబి యూనివర్శిటీ ఛాంపియన్‌గా నిలవగా సావిత్రి బాయ్ ఫూలే పూణే యూనివర్శిటీ ద్వితీయ, రాంచీ యూనివర్శిటీ తృతీయ స్థానాల్లో నిలిచాయి.