కృష్ణ

ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, ఫిబ్రవరి 22: రాష్ట్రంలో రైతులను ఆదుకుంటూ పశుపోషణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. దీనిలో భాగంగా రైతులకు పశుగ్రాసాన్ని అందిస్తూ పశుగణాభివృద్ధి కోసం ఊరూరా పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నూజివీడు మండలం పల్లెర్లమూడి గ్రామంలో బుధవారం సాయంత్రం ఈ పథకాన్ని మంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా 30 ఎకరాల విస్తీర్ణంలో రైతు పిన్నమనేని ప్రసాద్ సాగుచేసిన గడ్డి క్షేత్రాన్ని మంత్రి పుల్లారావు సంబంధిత అధికారులతో కలసి సందర్శించారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పలు పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. పశుగణాభివృద్ధిలో భాగంగా ప్రతి గ్రామంలో పశుగ్రాస క్షేత్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ప్రతి గ్రామంలో కనీసం 50 ఎకరాల విస్తీర్ణంలో గడ్డిని సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్తు చెప్పారు. పశు పెంపకంలో వ్యయాన్ని తగ్గించి పాల ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఈ విధానంపై రైతులను కూడా చైతన్యవంతులను చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పాడి పరిశ్రమపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, వీరందరి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. పాడి పరిశ్రమ దేశంలో అతిపెద్ద రంగం అని, ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. ప్రతి కూలి కూడా పాడి పశువును పెంచాలని సూచించారు. దీని ద్వారా అధిక ఆదాయం వస్తుందని అన్నారు. పశు గ్రాస క్షేత్రాల ఏర్పాటు ముందుకు వస్తే రైతులకు రాయితీలు ఇస్తున్నట్లు తెలిపారు. 50 నుండి 70 శాతం సబ్సిడీని రైతులకు అందిస్తామని చెప్పారు. ఉత్సాహం ఉన్న రైతులు ముందుకు రావాలని మంత్రి పుల్లారావు సూచించారు. పశుగ్రాస క్షేత్రాల ద్వారా రైతులు అధిక ఆదాయాన్ని కూడా పొందవచ్చని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ దామోదర నాయుడు, నూజివీడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు,నియోజకవర్గం పార్టీ నాయకులు కాపా శ్రీనివాసరావు, ఎంపిడిఒ అనురాధ, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు చలసాని ఆంజనేయులు, రాష్ట్ర పార్టీ నాయకులు అట్లూరి రమేష్, ఎంపిపి టి శ్రీనివాసరావు, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు బాణావత్ బద్రు, పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
కష్టాల కడలిలో కౌలు రైతులు
* అప్పుల ఊబిలో ఉక్కిరిబిక్కిరి
* వేధిస్తున్న ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్థులు
* పంట రుణాల మంజూరులో బ్యాంకర్ల మొండి చెయ్యి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 22: వ్యవసాయం తప్ప మరొక జీవనాధారం లేని కౌలు రైతుల పరిస్థితి జిల్లాలో కడు దుర్భరంగా మారింది. ఎన్నికల్లో హామీలు గుప్పించే పాలకులు కౌలు రైతుల సమస్యలపై కనె్నత్తి చూడటం లేదు. ఫలితంగా రుణాలు ఇచ్చి ఆదుకోవల్సిన బ్యాంకర్లు కూడా కౌలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. సకాలంలో పంట రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకర్లు మొండి చెయ్యి చూపిస్తున్నారు. దీంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కౌలు రైతులకు ఎదురవుతుంది. వడ్డీ వ్యాపారస్థుల గుమ్మం ఎక్కిన కౌలు రైతులకు వడ్డీ రేట్లు చుక్కలు చూపిస్తున్నారు. ఎన్ని చుక్కలు చూపించినా ఆ వడ్డీ వ్యాపారస్థులు ఇచ్చే రుణాలే రైతులకు శరణంగా మారుతున్నాయి. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని తెలిసి కూడా వడ్డీ వ్యాపారస్థుల నుండి అధిక వడ్డీలకు అప్పులు చేయక తప్పని పరిస్థితి జిల్లాలో నెలకొంది. పాలకుల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. రైతాంగాన్ని కోట్లలో రుణాలు ఇస్తున్నామంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్న పాలకులు ఆచరణలో మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లాలో రూ.300కోట్లు పంట రుణాలు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ బ్యాంకర్లు మాత్రం రూ.66కోట్ల మేర పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్థుల బారిన పడిన కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ముక్కుపిండి మరీ వసూళ్లు చేస్తుండటంతో తలలు తాకట్టు పెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లాలో సుమారు 33వేల మంది కౌలు రైతులు వ్యవసాయానే్న నమ్ముకుని జీవిస్తున్నారు. బ్యాంకర్లకు లక్ష్యాలు నిర్ధేశించినా వాటిని నెరవేర్చడంలో ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతుందనడంలో సందేహం లేదు. జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి కడు దుర్భరంగా మారింది. భూమినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న కౌలు రైతులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు.