కృష్ణ

నగదు రహిత లావాదేవీలపై అవగాహన అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 22: ప్రజాపంపిణీ విధానంలో నగదు రహిత లావాదేవీల నిర్వహణలో వచ్చే సమస్యల పట్ల సంబంధిత అధికారులు అవగాహన కలిగివుంటే వాటిని సులభంగా పరిష్కరించవచ్చునని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అన్నారు. బుధవారం ప్రజాపంపిణీలో నగదు రహిత లావాదేవీలపై స్థానిక సబ్-కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో రెండురోజుల రాష్టస్థ్రాయి సదస్సును నిర్వహిస్తున్నా రు. మొదటిరోజు సదస్సుల్లో పాల్గొన్న కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ ఏడాది కాలంగా ఇ-పోస్ విధానంలో నిత్యావసర సరుకుల పంపిణీ విధానంలో వస్తున్న సమస్యలను అధిగమించటం ద్వారా జిల్లాలో 98 శాతం నగదు రహిత బదిలీలో చేపట్టినట్లు తెలిపారు. సివిల్ సప్లయ్ అధికారులు తమ జిల్లాల్లో ప్రతీ ఎఫ్‌పి షాపులో కనీసం రెండు నగదు రహిత లావాదేవీలు నిర్వహించటం ద్వారా ఏమైనా సమస్యలు వస్తే వెంటనే నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఇ-పోస్ విధానం అమలు చాలా సులభతరంగా ఉంటుందని, వీటిలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకోవాలన్నారు. ఆధార్ ఆధారిత బ్యాంక్ అకౌంట్ లబ్ధిదారు లు, డీలర్లు కలిగి ఉంటే నగదు రహిత లావాదేవీలు ఇ-పోస్ విధానంలో సజావుగా జరుగుతాయన్నారు. వీటిలో ఏమైనా సమస్యల ఉత్పనమైతే బ్యాం కర్ల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జరిగే ప్రతీ లావాదేవీలు నగదు రహితంగా జరిపే విధంగా ఆలోచన ఉన్నందున ఆధార్ అనేబుల్డ్ పేమెంట్ సిస్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ సదస్సులో పాల్గొన్న అధికారులకు సూచించారు. రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ డైరెక్టర్ జి.రవిబాబు మాట్లాడుతూ ఇ-పోస్ విధానం జిల్లాలో అమలు జరుగుతున్న తీరును రాష్టస్థ్రాయిలో అమలుపరుస్తున్నందున అన్ని జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు వీటిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇ-పోస్ విధానం అమలు వాటి సాంకేతిక పరిజ్ఞానం ఈ వర్క్‌షాపు దోహదపడుతుందని రవిబాబు తెలిపారు. వర్క్‌షాపులో ఎఇపిడిఎస్‌లో కృష్ణాజిల్లా బెస్ట్ ప్రాక్టీస్ ఇన్ ఎఫ్‌పి షాప్స్ ఆటోమిషన్ ద్వారా రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎఇపిడిఎస్‌లో జిల్లాలో అవలంభించిన విధి విధానాలను సాధించిన విజయాలను సబ్ కలెక్టర్ గంధం చంద్రుడు వివరించారు. సదస్సులో 12 జిల్లాల పౌరశాఖల అధికార్లు, జిల్లా మేనేజర్లు, ఆంధ్రాబ్యాంక్ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.