కృష్ణ

పోర్టు పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 25: బందరు ఓడరేవు నిర్మాణానికి అవసరమైన భూముల సమీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. తుళ్లూరు తరహా ప్యాకేజీని ప్రకటించినప్పటికీ రైతుల నుండి స్పందన కరవైంది. ప్యాకేజీ అమలులో మెట్ట, మాగాణి భూములకు వ్యత్యాసం ఉండటంతో రైతుల నుండి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. రెవెన్యూ రికార్డుల్లో తమ భూములు మెట్టగా ఉన్నప్పటికీ తామంతా సాగు చేసుకుంటున్నామని, తమ భూములను మాగాణిగా పరిగణించి ప్యాకేజీ అమలు చేయాలని రైతులు కోరుతున్నారు. దీనిపై దృష్టి సారించిన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపి కొనకళ్ల నారాయణరావు సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లగా సానుకూలంగా స్పందించారు. దీంతో రెవెన్యూ, మడ అధికారులతో నిర్ధారణ కమిటీలు వేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. రెండు రోజులుగా భూముల సమీకరణపై మంత్రి రవీంద్ర, ఎంపి నారాయణరావు స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మడ, రెవెన్యూ, భూసమీకరణ కమిటీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మడ, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించగా శనివారం అదనంగా భూసమీకరణ కమిటీలతో భేటీ అయ్యారు. భూముల సమీకరణపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి పూలింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి రోజూ గ్రామాల్లో పర్యటించి రైతులను కలిసి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని వివరించాలన్నారు. తద్వారా రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తారన్నారు. కేవలం గ్రామాల్లో ఉన్న రైతులను కలవటమే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న రైతులను కూడా కలిసి పూలింగ్‌కు ఒప్పించాలని సూచించారు. ఎన్నికల ప్రచారం మాదిరిగా భూసమీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఇండస్ట్రియల్ నోడ్ కింద మన ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. దీని వల్ల రూ.3వేల కోట్ల పెట్టుబడులు మన ప్రాంతానికి రానున్నట్లు చెప్పారు. అరబ్ దేశాలు లక్ష కోట్లతో రిఫైనరీ ఏర్పాటుకు ముందుకు వస్తున్నట్లు చెప్పారు. రూ.750కోట్లతో చేపట్టిన విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. పెడన నుండి ఖమ్మం జిల్లాకు వెళ్లే జాతీయ రహదారి అభివృద్ధి పనులు కూడా పూర్తి కావస్తున్నట్లు మంత్రి రవీంద్ర, ఎంపి నారాయణరావు చెప్పారు. ఈ అంశాలన్నింటినీ రైతులకు వివరించాల్సిన బాధ్యత అధికారులు, భూసమీకరణ కమిటీలపై ఉందన్నారు. ఈ సమావేశంలో మడ డెప్యూటీ కలెక్టర్లు సుబ్బరాజు, నరేంద్ర ప్రసాద్, సీతారామ్మూర్తి, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, ఎఎంసి చైర్మన్ గోపు సత్యనారాయణ, టిడిపి సీనియర్ నాయకులు కొనకళ్ల బుల్లయ్య, బూరగడ్డ రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సోల్ మీడియాతో
సమాజంలో మార్పు
పాతబస్తీ, ఫిబ్రవరి 25: సోషల్ మీడియా ప్రభావం యువతపై ఎంతో ఉందని, సమాజంలో మార్పుకు ఇది దోహదపడుతోందని పారిశ్రామికవేత్త దాసరి రామకృష్ణ అన్నారు. పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం జరిగిన సోషల్ మీడియా ఫర్ సొసైటీ (ఎస్‌ఎంఎస్) ప్రథమ వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. సోషల్ మీడియా ద్వారానే నిజమైన సమాచారం కొంత అందుబాటులో ఉంటుందన్నారు. తమ భావాలను నిర్భయంగా వ్యక్తపరచడానికి సోషల్ మీడియా అసలైన వేదికగా మారిందని వివరించారు. సంస్థ వ్యవస్థాపకులు గరికపాటి విజయప్రకాష్, ప్రమోద్, కె నాగేశ్వరరావు, బి శ్రీనివాసరావు, కె శ్రీనివాసరావు పాల్గొన్నారు.