కృష్ణ

సంజీవని వైద్యాలయ నిర్మాణ పనులు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, మార్చి 4: పర్యాటక కేంద్రం, నాట్యక్షేత్రం కూచిపూడి పసుమర్తివారి ధర్మచెరువులో సిలికానాంధ్ర నిర్మించనున్న సిలికానాంధ్ర సంజీవని మల్టీ స్పెషాలిటీ వైద్యాలయం నిర్మాణానికి ప్రభుత్వం నుండి అన్ని రకాల అనుమతులు లభించాయని చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. ప్రభుత్వ అనుమతులు జాప్యం కావటంతో వైద్యాలయం నిర్మాణంపై నీలినీడలు వ్యాపించిన నేపథ్యంలో శనివారం నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో సందేహాలు తొలగిపోయాయి. గత రెండు రోజులు నుండి వైద్యాలయం నిర్మాణానికి చేపట్టిన విరాళాల సేకరణలో భాగంగా 460 చదరపు అడుగులకు రూ.16లక్షల 10వేలు అందాయని ఆనంద్ తెలిపారు. అనే్న రాజేంద్రకుమార్ రూ.లక్షా 5వేలు, గొరుముచ్చు వెంకటేశ్వరరావు రూ.లక్షా వేలు, చీకటిమర్ల బాలభాస్కరరావు రూ.55వేలు అందచేసినట్లు తెలిపారు. ఈ నిధులతో పాటు ఇప్పటికే వాగ్దానం జరిగిన నిధులతో రూ.35కోట్ల అంచనాలతో నిర్మాణం ప్రారంభించిన 200 పడకల సంజీవని వైద్యాలయం మే నెలాఖరు నాటికి సెల్లార్, రిటైనింగ్‌వాల్, గ్రౌండ్ లెవల్ నిర్మాణాలు పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పిన్నమనేని బీమశంకరరావు, పామర్తి శివప్రసాద్, బెల్లంకొండ వెంకటేశ్వరరావు, శివరామయ్య, జి వెంకటేశ్వరరావు, కె వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బాబు.ఎకు మరో అరుదైన గౌరవం
* ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్-2017కు ఆహ్వానం
* కీలక ఉపన్యాసం చేయనున్న బాబు.ఎ
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మార్చి 4: కృష్ణాజిల్లా కలెక్టర్ బాబు.ఎకు మరో అరుదైన గౌరవం లభించనుంది. ఇప్పటికే పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతీయ స్థాయి అవార్డులను అందుకున్న కలెక్టర్ బాబు.ఎ ఈ నెల 6వతేదీన రాష్టప్రతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఫెస్టివల్ ఆఫ్ ఇన్నోవేషన్-2017లో భాగంగా కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఈ మేరకు రాష్టప్రతి భవన్ నుండి కలెక్టర్‌కు ఆహ్వానం అందింది. ఆధార్ అనుసంధానంతో ప్రజా పంపిణీ వ్యవస్థ, ఉపాధి హామీ వేతనాల పంపిణీ, జన్ ధన్ ఆధార్ మొబైల్ (జామ్) బేస్‌డ్, సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ, ఆధార్ ఆధారిత ఎరువుల పంపిణీలో లబ్ధిదారుని ఖాతాకు సబ్సిడీని నేరుగా జమ చేయటం, ఆధార్ పే వంటి వాటిని దేశంలోనే తొలిసారిగా కృష్ణాజిల్లాలో ప్రయోగాత్మకంగా నిర్వహించి విజయం సాధించిన కలెక్టర్ బాబు.ఎ అనేక సార్లు జాతీయ స్థాయి అవార్డులను అందుకున్నారు. నగదు రహిత లావాదేవీల ద్వారా జిల్లా వ్యాప్తంగా 35లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరింది. ఈ అంశాలపై కలెక్టర్ బాబు.ఎ కీలక ఉపన్యాసం చేయనున్నారు. దేశంలో ఏ ఐఎఎస్ అధికారికీ దక్కని గౌరవం జిల్లా కలెక్టర్ బాబు.ఎకు దక్కడం పట్ల అధికార వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

పోర్టు రోడ్డు విస్తరణ జాప్యంపై మంత్రి కొల్లు ఆగ్రహం
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, మార్చి 4: స్థానిక పోర్టు రోడ్డు విస్తరణలో గత రెండేళ్లుగా జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ అంశంపై శనివారం మంత్రి రవీంద్ర తన నివాసంలో అధికారులు, పోలీసులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోటావారితుళ్ల సెంటరు నుండి రైల్వే ట్రాక్ వరకు విస్తరణ పనులు, సెంటర్ డివైడర్స్, సెంట్రర్ లైటింగ్ పనులు పూర్తయి చాలా రోజులు గడుస్తున్నా కోటావారితుళ్ల సెంటరు నుండి కోనేరుసెంటరు వరకు విస్తరణలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. 65 అడుగుల మేర విస్తరణకు చాలా మంది వ్యాపారులు అంగీకరించారని, మిగిలిన వారు కూడా స్వచ్చందంగా ముందుకు రావాలన్నారు. లేని పక్షంలో మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 అడుగుల విస్తరణకు భూసేకరణ చేసి నష్టపరిహారం ఇస్తామన్నారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు బృందంగా ఏర్పడి సోమవారం నాటికి మార్కింగ్ వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి బుల్లయ్య, ఆర్‌అండ్‌బి ఇఇ మురళీకృష్ణ, తహశీల్దార్ నారదముని తదితరులు పాల్గొన్నారు.