కృష్ణ

ఎపిసిఆర్‌డిఎకు ‘హడ్కో’ అవార్డు ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 25: హడ్కో 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎపి సిఆర్‌డిఎకు ప్రకటించిన రెండు అవార్డులను సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్‌కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధానం చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరాతి నగరం నిర్మాణంలో అవలంభించిన విన్నుత్న ఆలోచనలకు గాను అవార్డులను ప్రకటించిన హడ్కో మంగళవారం దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అందించారు. పట్టణ వౌళిక వసతుల ప్రణాళికలో చేసిన విశేష కృషి తోపాటు రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని సమీకరించడంలో అమలుచేసిన భూ సమీకరణ పథకానికి హడ్కో పురస్కారాం ప్రకటించింది.
2016-17 సంవత్సరానికి గాను ఇంప్రూవ్ ద లివింగ్ ఎన్విరాన్‌మెంట్ , అర్బన్ గవర్నెన్స్ కేటగిరిలో ఎల్పీఎస్‌కు అవార్డు ఇచ్చారు. అమరావతి స్వచ్ఛంధ భూ సమీకరణ పథకం ఎంట్రీని సిఆర్‌డిఎ అధికారులు నామినేషన్‌కు పంపగా దానినిన పరిశీలించిన హడ్కో అవార్డుల కమిటీ ఉత్తమ విధానంగా ప్రశంసించి ప్రకటించిన అవార్డు కింద లక్ష రూపాయల నగదు తోపాటు ప్రశంసా పత్రాన్ని అందించారు. అవార్డు అందుకొన్న కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ స్పందిస్తూ రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణలో భూమిలచ్చిన రైతుల త్యాగానికి గుర్తింపుగా ఈ అవార్డు లభించడం హర్షనీయమని పేర్కొన్నారు.