కృష్ణ

నిబంధనలతో నీరసిస్తున్న ఎన్టీఆర్ ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఏప్రిల్ 19: ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు నిబంధనలు చిక్కుముడులుగా మారుతున్నాయి. అర్ధం పర్ధం లేని నిబంధనలతో లబ్ధిదారుడు సొంతింటి కలకు దూరమవుతున్నాడు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఎన్టీఆర్ గృహ నిర్మాణాల పరిస్థితి తయారైంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు మంజూరు చేసినా నిబంధనల కారణంగా వాటిని నిర్మించుకునే పరిస్థితిలో లబ్ధిదారులు కనిపించడం లేదు. దీంతో ఎన్టీఆర్ గృహ నిర్మాణాల్లో ఆశించిన ప్రగతి కనిపించడం లేదు. గృహ నిర్మాణాల్లో జరుగుతున్న జాప్యంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా ఎన్టీఆర్ గృహ నిర్మాణాల శంకుస్థాపనలకు తెర లేపిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద మంజూరై నిర్మాణాలు ప్రారంభించని గృహాలన్నింటికీ ఈ కార్యక్రమం ద్వారా శంకుస్థాపనలు చేయించారు. శంకుస్థాపనలైతే చేయించారే గానీ ఆ తర్వాత జరిగే నిర్మాణాలను ముందుకు తీసుకువెళ్లలేకపోయారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 24వేల గృహాలకు శంకుస్థాపనలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 6వేల గృహాలకు మాత్రమే శంకుస్థాపనలు చేయించగలిగారు. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ పథకం కింద యూనిట్ విలువ రూ.1.50లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు రూ.92వేలు జమ కానున్నాయి. మిగిలిన మొత్తం ఉపాధి హామీ పథకం ద్వారా జమ చేయాల్సి ఉంటుంది. ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నమవుతోంది. ఉపాధి హామీ పథకం కింద ద్వారా జమ కావల్సిన మొత్తం సకాలంలో రావడం లేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ పథకం కింద మంజూరు కావల్సిన రూ.58వేలులో ఇటుకలకు రూ.24వేలు, మరుగుదొడ్లకు రూ.15వేలుతో పాటు 90 రోజుల కూలీ కింద కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అన్ని శాఖల్లో కృష్ణాజిల్లా ప్రథమ స్థానంలో నిలుస్తున్నా గృహ నిర్మాణాల విషయంలో ప్రగతి సాధించడం లేదు. ఇదే విషయమై కలెక్టర్ బి లక్ష్మీకాంతం ప్రతి సమీక్ష సమావేశంలోనూ సంబంధిత శాఖాధికారులపై రుసరుసలాడటం పరిపాటిగా మారిపోయింది. మూడు విభాగాలుగా గృహాల మంజూరు జరిగింది. ఎన్టీఆర్ రూరల్, గ్రామీణ్, అర్బన్ పథకాల కింద కేటాయింపులు జరిగాయి. ఆయా పథకాలకు యూనిట్ ధరలు రూ.1.50లక్షల నుండి రూ.3.50లక్షల వరకు నిర్ణయించారు. ఎన్టీఆర్ రూరల్ పథకానికి సంబంధించి 2016-17 సంవత్సరంలో 16వేల 990 గృహాలు మంజూరు కాగా 12వేల గృహాలు మాత్రమే నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. 2017-18లో 14వేల 214 గృహాలు మంజూరు కాగా 2701 నిర్మాణాలు పూర్తయ్యాయి. 2018-19 సంవత్సరానికి 15వేల 800 గృహాలు మంజూరు కాగా 14వేల 200 గృహాలకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది. నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉంది. గ్రామీణ్ పథకానికి సంబంధించి 2016-17 సంవత్సరంలో 10వేల 580 గృహాలు మంజూరు కాగా 3వేల 600 నిర్మాణాలు పూర్తయ్యాయి. అర్బన్ పథకానికి సంబంధించి 2016-17లో మచిలీపట్నం మున్సిపాల్టీ, విజయవాడ కార్పొరేషన్‌కు 1448 గృహాలు మంజూరు కాగా 642 గృహాలు పూర్తయ్యాయి. 2018-19లో జిల్లాకు 8వేల 142 గృహాలు మంజూరు కాగా లబ్ధిదారుల ఎంపిక కసరత్తు జరుగుతోంది.

మన ప్రభుత్వం రాగానే
సమస్యలన్నీ పరిష్కారం
* ప్రజా సంకల్ప యాత్రలో జగన్
ఆగిరిపల్లి, ఏప్రిల్ 19: వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్ప యాత్రకు ఆగిరిపల్లి మండల ప్రజల నుండి విశేష స్పందన లభించింది. గురువారం శోభనాపురం శివారు నుంచి ఉదయం 3 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగింది. బస చేసిన ప్రాంతంలోజగన్ రాకముందే వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున శిబిరానికి తరలివచ్చారు. జగన్ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలను సానుకూలంగా విని తమ ప్రభుత్వం రాగానే సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఆయన అన్నారు. తిరిగి శనివారం ఉదయం సీతారామపురం నుండి ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమవుతుందని స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌అప్పారావు అన్నారు. ఈ యాత్ర వెంట వంగవీటి రాధా, ఎమ్మెల్సీ ఆళ్ళ నాని, ఏలూరు పార్లమెంట్ ఇన్‌ఛార్జి కోటగిరి శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు.